వాజీద్ ఖాన్ తల్లికి కరోనా.. ఆమె ద్వారానే అతడికి సోకిందా..!

కరోనా బారిన పడి మరణించిన ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు, గాయకుడు వాజీద్‌ ఖాన్‌ తల్లి రజినాకు కోవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.

వాజీద్ ఖాన్ తల్లికి కరోనా.. ఆమె ద్వారానే అతడికి సోకిందా..!
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 3:14 PM

కార్డియాక్ అరెస్ట్‌తో మరణించిన ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు, గాయకుడు వాజీద్‌ ఖాన్‌ తల్లి రజినాకు కోవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. వాజీద్ కంటే ముందే ఆమెకు వైరస్ సోకినట్లు సమాచారం. కాగా కిడ్నీ సంబంధ వ్యాధి, నోటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వాజీద్ ఇటీవల ఆసుపత్రిలో చేరగా.. అతడిని చూసుకునేందుకు ఆమె అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి కరోనా బాధితుల నుంచి రజినాకు.. ఆ తరువాత ఆమె నుంచి వాజీద్‌కి వైరస్ సోకిందేమోనని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజినా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

కాగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాజీద్‌కి కరోనా కూడా సోకింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు. భారత సినీ పరిశ్రమ ఓ అద్భుత గాయకుడిని, సంగీత దర్శకుడిని కోల్పోయింది అంటూ అమితాబ్‌, సల్మాన్‌, అక్షయ్‌ కుమార్, కత్రినా కైఫ్‌, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు ట్వీట్లు చేశారు. వాజీద్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరిగాయి.

Read This Story Also: నేనే మీ చట్టాన్ని.. నా మాటే శాసనం.. డొనాల్డ్ ట్రంప్