లోక్ సభలో వైసీపీ పక్షనేతగా బాలశౌరి?

151 అసెంబ్లీ సీట్లతో ఏపీలో వైసీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 22 మంది ఎంపీలతో వీచిన ఫ్యాన్ గాలికి టీడీపీ కేవలం మూడు ఎంపీలకే పరిమితమైంది.  మరి ఈ 22 మంది ఎంపీలను సభలో లీడ్ చేసేదేవరు… ప్రత్యేక హోదా సాధనతో పాటు రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు రాబట్టడంతో పాటు.. ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యత సాధించింది కాబట్టి సభలో సమర్థవంతంగా లౌక్యంగా వ్యవహరించే కోణంలో వైఎస్ జగన్ మచిలీపట్నం నుంచి […]

లోక్ సభలో వైసీపీ పక్షనేతగా బాలశౌరి?
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: May 29, 2019 | 6:30 PM

151 అసెంబ్లీ సీట్లతో ఏపీలో వైసీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 22 మంది ఎంపీలతో వీచిన ఫ్యాన్ గాలికి టీడీపీ కేవలం మూడు ఎంపీలకే పరిమితమైంది.  మరి ఈ 22 మంది ఎంపీలను సభలో లీడ్ చేసేదేవరు… ప్రత్యేక హోదా సాధనతో పాటు రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు రాబట్టడంతో పాటు.. ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యత సాధించింది కాబట్టి సభలో సమర్థవంతంగా లౌక్యంగా వ్యవహరించే కోణంలో వైఎస్ జగన్ మచిలీపట్నం నుంచి గెలుపొందిన ఎంపీ బాలశౌరీని లోక్ సభ పక్షనేతగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

జగన్‌ను  శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న రోజే..పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోవాల్సి ఉన్నా..సమయాభావం వల్ల ఎన్నిక ఆలస్యమైంది. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా బాలశౌరి ని ఎంపిక చేయాలని తాజాగా జగన్ నిర్ణయించారని సమాచారం. రెండో సారి ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి , ఒంగోలు నుంచి గెలుపొందిన సీనియర్ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి.. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. అనుభవం.. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు నేపథ్యంలో బాలశౌరీ వైపు వైఎస్ జగన్ మొగ్గు చూపారని తెలుస్తోంది.  ఎలాగూ రాజ్యసభ పక్ష నేతగా విజయసాయి రెడ్డి ఉండనే ఉన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు సామాజికవర్గానికి చెందిన తోట నరసింహాం పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు. బాలశౌరి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత .. అందులోనూ గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం.. అప్పట్లో వైఎస్‌కు, ఇప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆప్తుడితో పాటు కాపు సామాజికవర్గానికి పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించామనే సంకేతాలు పోతాయని జగన్ ఈ నిర్ణయానికొచ్చారంటున్నారు పార్టీ సీనియర్ నేతలు.