ఏపీలో 12 కొత్త జిల్లాలు ఎంట్రీ
తాను అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైసీసీ ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించామని.. జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ఫైల్ ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో అరకు, […]
తాను అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైసీసీ ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించామని.. జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ఫైల్ ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో అరకు, అనకాపల్లి.. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, రాజమండ్రి.. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం.. కృష్ణా జిల్లాలో విజయవాడ.. గుంటూరు జిల్లాలో నర్సరావుపేట, బాపట్ల.. కర్నూల్ జిల్లాలో నంద్యాల.. చిత్తూరు జిల్లాలో తిరుపతి.. అనంతపురం జిల్లాలో హిందూపురం, కడప జిల్లాలో రాజంపేటలు కొత్త జిల్లాలుగా మారబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరంలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్‌గా ఉంటుందని సమాచారం.