జగన్ అనే నేను..ముస్తాబైన బెజవాడ

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో ఎలాగూ లైవ్ చూస్తారు. విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ […]

జగన్ అనే నేను..ముస్తాబైన బెజవాడ

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో ఎలాగూ లైవ్ చూస్తారు. విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నుంచి డిఎంకే అధినేత స్టాలిన్ వస్తున్నారు. పలు జాతీయ పార్టీల నాయకులు సైతం హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే  విజయవాడలో హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. జగన్ కటౌట్లు, వైసీపీ తోరణాలు విజయవాడ నిండా దర్శనమిస్తున్నాయి. స్టేడియంలో 20,000 మంది మాత్రమే కూర్చునే ఛాన్స్ ఉంది. మొత్తంగా 18 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీవీఐపీల కోసం స్పెషల్‌గా మూడు ఎంట్రన్స్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికీ 150 నుంచీ 200 పాస్‌లు జారీ చేశారు.