బ్రేకింగ్: జగన్‌పై దాడి కేసు.. శ్రీనివాస్ బెయిల్ క్యాన్సిల్, అరెస్ట్

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మే 22న శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. దాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్ బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీనివాస్ ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకాగా.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:38 pm, Tue, 13 August 19
బ్రేకింగ్: జగన్‌పై దాడి కేసు.. శ్రీనివాస్ బెయిల్ క్యాన్సిల్, అరెస్ట్

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మే 22న శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. దాన్ని రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీనివాస్ బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడి బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీనివాస్ ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకాగా.. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన విషయం తెలిసిందే.