ఏపీ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు.. జరగనున్నాయిలా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణపై పంచాయితీ రాజ్ కమిషనర్ మాట్లాడారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. వీటికి 22.73లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇక సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్ తెలిపారు. […]

ఏపీ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు.. జరగనున్నాయిలా
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 3:54 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణపై పంచాయితీ రాజ్ కమిషనర్ మాట్లాడారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. వీటికి 22.73లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఇక సచివాలయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 1 నుంచి పరీక్షలు ప్రారంభించి వారం రోజుల పాటు నిర్వహిస్తామని గిరిజా శంకర్ తెలిపారు.

ప్రశ్నాపత్రాలు రెండు భాషల్లో ఉంటాయని.. టెక్నికల్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటాయని పేర్కొన్నారు. ఇక మొదటి రోజు 12 లక్షల 50వేల మంది పరీక్ష రాస్తారని చెప్పుకొచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీసీటీవీ, వీడియో కవరేజ్ పెట్టి ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు.

మరోవైపు పంచాయితీ, మున్సిపల్ శాఖలు కలిసి సమన్వయంతో సచివాలయ ఉద్యోగాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. 150ప్రశ్నలకు 150మార్కులుంటాయని.. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుందని తెలిపారు. ప్రతి 4 తప్పు సమాధానాలకు ఒక మార్కు నష్టపోతారని.. ఎవరైనా పోస్టుల విషయంలో అభ్యర్థులను మోసం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని విజయ్ కుమార్ హెచ్చరించారు.

ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్