ఏపీసీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ

ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాటిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ(ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఏపీసీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ

AMDRA Members: ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాటిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ(ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 11 మంది ఉండనుండగా.. అందులో ఒకరు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌, మరొకరు సభ్య కన్వీనర్‌, మిగిలిన తొమ్మిది మంది సభ్యులుగా ఉండనున్నారు. ఇక ఛైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమించనున్నారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ మరో జీవోను జారీ చేశారు.

ఏఎంఆర్‌డీఏలోని ఎవరెవరు సభ్యులుగా ఉండనున్నారంటే
1.డిప్యూటీ చైర్‌పర్సన్‌-‌  మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి
2. సభ్య కన్వీనర్-  ఏఎంఆర్‌డీఏ కమిషనర్
3.‌ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు
4.గుంటూరు జిల్లా కలెక్టర్‌ –సభ్యుడు
5.కృష్ణా జిల్లా కలెక్టర్‌ – సభ్యుడు
6.టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ –సభ్యుడు
7.రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ –సభ్యుడు
8.ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ –సభ్యుడు
9.ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ –సభ్యుడు
10.రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు
11.రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు.

Click on your DTH Provider to Add TV9 Telugu