టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుకు షాక్ తగిలింది. బోండాపై, ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు, పోలీసులను ఆదేశించింది. సుమశ్రీ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనపై కేసు నమోదు చేయాలని తెలిపింది.
కాగా రెండు సంవత్సరాల క్రితం మరణించిన తన కుమార్తె సాయిశ్రీ చావుకు బోండా ఉమ, ఆయన కుమారుడు కారణమని సుమశ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో బోండా ఉమ, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.