ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు షాక్..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది...

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు షాక్..
Follow us

|

Updated on: Jun 30, 2020 | 3:33 PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 483.27 ఎకరాల్లో 253.61 ఎకరాలే ఉపయోగిస్తున్నారన్న ఏపీ ప్రభుత్వం.. గత పదేళ్లుగా 229.66 ఎకరాలు మాత్రమే వినియోగించారని చెప్పింది. అగ్రిమెంట్‌లో చెప్పిన విధంగా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టడంలో కానీ, 20 వేల ఉద్యోగాల కల్పనకు చేసిన హామీలు నిలబెట్టుకోవలేదని పేర్కొన్న ప్రభుత్వం 4310 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించింది. ఈ మేరకు మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది.