ఇకపై చీఫ్ విప్, విప్‌లకు కేబినెట్ హోదా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్, విప్‌లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చీఫ్ విఫ్ శ్రీకాంత్‌రెడ్డి.. విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు కేబినెట్ హోదా దక్కింది. వీరితో పాటు ఏపీ శాసనమండలి చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు కూడా కేబినెట్ హోదా లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారికంగా […]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్, విప్‌లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చీఫ్ విఫ్ శ్రీకాంత్‌రెడ్డి.. విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు కేబినెట్ హోదా దక్కింది. వీరితో పాటు ఏపీ శాసనమండలి చీఫ్ విప్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు కూడా కేబినెట్ హోదా లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో 25మంది మంత్రులు ఉండగా.. ఆ లిస్ట్‌లో కొత్తగా తొమ్మిది మంది చేరారు.