AP ESI Scam : ఏపీ ఈఎస్‌ఐలో భారీ స్కామ్.. మాజీ మంత్రిపై ఆరోపణలు..!
తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నివేదికలో స్కామ్‌కు సంబంధించిన కీలకమైన విషయాలు బట్టబయలయ్యాయి. గడిచిన 6 ఏళ్ల కాలంలో సుమారు రూ.100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.
తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నివేదికలో స్కామ్‌కు సంబంధించిన కీలకమైన విషయాలు బట్టబయలయ్యాయి. గడిచిన 6 ఏళ్ల కాలంలో సుమారు రూ.100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఈఎస్‌ఐ పరిధిలో లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకొచ్చి భారీగా ఆర్డర్లు ఇచ్చిన బాగోతం వెలుగులోకి వచ్చింది. అసలు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ.51కోట్లు చెల్లించినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ స్కామ్‌లో ఈఎస్‌ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయను నిందితులుగా గుర్తించారు. మెడిసిన్, ఎక్విప్‌మెంట్ అసలు ధరకంటే..135 శాతం అధికంగా కోట్ చేసిన కంపెనీలుకు, నకిలీ కొటేషన్లతో అసలు లేని సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం సహా భారీ స్కామ్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్, లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలకు ఏపీ ఈఎస్‌ఐ డైరెక్టర్లు అక్రమంగా రూ.85కోట్లు చెల్లించినట్టు సమాచారం. టోటల్ స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు…6గురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు సహకారం అందించినట్లు తేలింది. మొత్తం ముగ్గురు డైరెక్టర్ల హయాంలో రూ. 100 కోట్ల నకిలీ బిల్లులు గుర్తించారు అధికారులు. అయితే అనూహ్యంగా ఈ స్కామ్‌లో మాజీ మినిస్టర్ అచ్చెన్నాయుడు పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఆయన నామినేషన్ పద్దతితో ఈ టెండర్లు ఇప్పించినట్టు విచారణలో తేలినట్టు తెలుస్తోంది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంతో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని అధికారులు తేల్చారు.