అనవసర ఖర్చులకు కళ్లెం.. వాటర్ బాటిల్ నుంచి

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ లోటు బడ్జెట్‌లోనే నడుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐతో పాటు కొన్ని సంస్థలకు వేల కోట్లు అప్పులో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనవసర ఖర్చులకు ఎక్కడికక్కడ కత్తెర వేస్తున్నారు. ఈ విషయంలో ‘‘అందరితో పాటే నేను’’అని భావిస్తోన్న సీఎం జగన్.. తనకు ప్రత్యేకత వద్దొంటూ అధికారులతో కలిసిపోతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తన అధికారులతో కలిసి రూ.20ల […]

అనవసర ఖర్చులకు కళ్లెం.. వాటర్ బాటిల్ నుంచి
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 12, 2019 | 5:00 PM

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ లోటు బడ్జెట్‌లోనే నడుస్తోంది. ఇప్పటికే ఆర్బీఐతో పాటు కొన్ని సంస్థలకు వేల కోట్లు అప్పులో ఉంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనవసర ఖర్చులకు ఎక్కడికక్కడ కత్తెర వేస్తున్నారు. ఈ విషయంలో ‘‘అందరితో పాటే నేను’’అని భావిస్తోన్న సీఎం జగన్.. తనకు ప్రత్యేకత వద్దొంటూ అధికారులతో కలిసిపోతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తన అధికారులతో కలిసి రూ.20ల వాటర్‌ బాటిల్‌ను జగన్ ఉపయోగిస్తున్నట్లు ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో అధికారులు రూ.60లు విలువ చేసే వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు ప్రతి బాటిల్‌పై రూ.40లు మిగిలిస్తున్నారు జగన్. దీంతో ఆయన అభిమానులు మంచి ప్రభుత్వానికి రోజులొచ్చాయంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తన జీతాన్ని కూడా నెలకు రూ.1గా తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.