విద్యాశాఖపై సీఎం సమీక్ష.. టీచర్ల భర్తీకి లైన్ క్లియర్..

విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని చెప్పారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించాలని.. అందుకోసం ప్రత్యేక క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, ఇప్పటికే 98 శాతం పాఠశాలల వీడియోలు, ఫొటోలను వెబ్‌సైట్‌లో విద్యాశాఖ అప్‌లోడ్ చేసింది. […]

విద్యాశాఖపై సీఎం సమీక్ష.. టీచర్ల భర్తీకి లైన్ క్లియర్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2019 | 7:57 PM

విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని చెప్పారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించాలని.. అందుకోసం ప్రత్యేక క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కాగా, ఇప్పటికే 98 శాతం పాఠశాలల వీడియోలు, ఫొటోలను వెబ్‌సైట్‌లో విద్యాశాఖ అప్‌లోడ్ చేసింది. మౌలిక సదుపాయాల కల్పన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజల ముందుంచాలని సీఎం చెప్పారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం సహకరిస్తున్న విదేశాంగశాఖ, సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు.