ఏపీ కేబినెట్‌ భేటీ షాకింగ్ డెషిషన్స్

ప్రజా రవాణా సంస్ధ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం చర్చించి ఆమోందించారు. విలీనంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి కమిటీ సమర్పిచిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీ వివరాలను రాష్ట్ర మంత్రి పేర్నినాని వివరించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందున ఉద్యోగస్తులందర్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే పరిగణిస్తామన్నారు మంత్రి నాని. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు అవుతుందని, […]

ఏపీ కేబినెట్‌ భేటీ   షాకింగ్ డెషిషన్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 04, 2019 | 6:34 PM

ప్రజా రవాణా సంస్ధ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం చర్చించి ఆమోందించారు. విలీనంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి కమిటీ సమర్పిచిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీ వివరాలను రాష్ట్ర మంత్రి పేర్నినాని వివరించారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందున ఉద్యోగస్తులందర్నీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే పరిగణిస్తామన్నారు మంత్రి నాని. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు అవుతుందని, ఇందులో వీరందర్నీ రీ రిజిగ్నేట్‌ చేయాలన్న ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సును మంత్రివర్గం ఆమోదించినట్టు చెప్పారు. ఈ ప్రక్రియను మూడు మాసాల్లో పూర్తిచేయాలని రవాణాశాఖ, ఆర్థికశాఖ, న్యాయశాఖ, సాధారణపరిపాలన శాఖలకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

నూతన ఇసుక విధానం:

గత ప్రభుత్వ హాయంలో భారీగా ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు మంత్రి పేర్ని నాని. గతంలో జరిగిన విధానానికి చెక్ పెడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను పంపిణీ చేయడానికి సిద్ధమైనట్టుగా చెప్పారు. దీనికోసం నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ కొత్త ఇసుక పాలసీకి సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇప్పటి వరకు ఇసుక సప్లై చేయడానికి 41 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని, వాటిని రానున్న రోజులలో 70 నుంచి 80 వరకు పెంచుతామన్నారు. గత ప్రభుత్వంలో వసూలు చేసిన దానికంటే తమ ప్రభుత్వ తక్కువ ధరకే ఇసుకను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మంత్రి నాని. ఇసుక రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్ణయించామని, అక్కడ నుంచి రవాణా ఖర్చు అదనమనిచెప్పారు. ప్రతి వాహనంలో జీపీఎస్‌ ఏర్పాటు చేస్తామని, రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు, స్టాక్‌ పాయింట్‌ నుంచి వినియోగదారునికి చేరేంత వరకు వాహనాల్లో జీపీఎస్‌ ఉంటుందన్నారు. అనుమతి లేని వాహనాల్లో ఇసుకను తరలించడం, ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడం నిషేదించినట్టు మంత్రి నాని పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లకు ఆర్ధికసాయం:

సొంతంగా ప్యాసింజర్‌ ఆటోలు, ట్యాక్సీలు నడిపే వారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ఓనర్‌ కం డ్రైవర్‌లకు ఆర్థిక సహాయం, భర్త, భార్యలు ఇద్దర్ని ఒక యూనిట్‌గా, అదే కుటుంబంలో మేజర్‌ కొడుకు లేదా కూతురు ఓనర్‌ కం డ్రైవర్‌ అయితే వారిని వేరే యూనిట్‌గా పరిగణిస్తారు. ఏడాదికి రూ. 397. 93 కోట్లు సాయం చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది.

వైయస్సార్‌ పెళ్లికానుక:

గత ప్రభుత్వం అమలుచేసిన చంద్రన్న పెళ్లికానుక స్ధానంలో వైఎస్సార్ పెళ్లికానుకను ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈపథకంలో లబ్దిదారులకు ఎస్సీలకు రూ.40వేల నుంచి రూ. 1 లక్ష, ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ. 1లక్ష ,బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50వేలు,మైనార్టీలకు రూ. 50వేల నుంచి రూ.1 లక్ష ,వికలాంగులకు రూ.1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలు,ఎస్సీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ.1.20 లక్షలు,ఎస్టీ కులాంతర వివాహాలు చేసుకుంటే… .రూ. 1.20లక్షలు, బీసీ కులాంతర వివాహాలు చేసుకుంటే.. రూ. 70వేలు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ పెళ్లి రోజు శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా ఏటా రూ.746.55 కోట్లు ఖర్చు చేయనుంది.

పెరిగిన ఆశా వర్కర్ల జీతాలు:

ఆశావర్కర్ల జీతాల పెంపునకు పెంపునకు కేబినెట్‌ ఆమోదించింది. రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదించారు. జీతాల రూపంలో చెల్లించాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం విడుదలచేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

  మచిలీపట్నం పోర్టు భూములపై నిర్ణయం:

మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం పనులు ప్రారంభించకపోవడం, భూముల లీజు కూడా చెల్లించక పోవడంతో కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

నవయుగకు కాంట్రాక్ట్ రద్దు:

నవయుగకు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3216.11 కోట్ల టెండర్‌ను రద్దుకు కేబినెట్‌ ఆమోదించింది. రివర్స్‌ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని కూడా నిర్ణయించింది. నియమాలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25శాతం మేర అయిన ఇచ్చిన రూ.780 కోట్ల మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లను రికవరీకి నిర్ణయం, గత ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆక్షేపించింది.

మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగింపు

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం ఆంధ్రాబ్యాంకు విలీనంపై చర్చ

ఆంధ్య్రాబాంకు విలీనంపై ఏపీ కేబినెట్ చర్చించింది. స్వాతంత్రానికి పూర్వమే భోగరాజు పట్టాభిసీతారామయ్య ఆంధ్రాబ్యాంకును స్ధాపించారని, విలీనం తప్పనిసరైనప్పుడు ఆంధ్రాబ్యాంకు పేరును అలాగే ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ కేబినెట్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానికి సీఎం జగన్ లేఖరాయాలని కేబినెట్‌ నిర్ణయించింది.