AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Assembly: 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి ఆ కీలక బిల్లులు సభ ముందుకు..

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

AP Assembly: 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి ఆ కీలక బిల్లులు సభ ముందుకు..
Ap Assembly
Basha Shek
|

Updated on: Sep 10, 2022 | 8:48 AM

Share

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాగా సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఇక సమావేశాల తొలి రోజున జరిగే బీఏసీ సమావేశంలో సభ అజెండాను ఖరారు చేయనున్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేయాలని అధికార పక్షం భావిస్తోంది. పోలవరం – పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని వైసీపీ భావిస్తోంది. ఇక ప్రతిపక్షాలు ఆందోళన చేస్తోన్న నిత్యావసర ధరలు.. శాంతి భద్రతల పైన చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది.

కాగా ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లులను మరోసారి సభ ముందుకు తీసుకొస్తుందనే ప్రచారం సాగుతోంది. అయితే, హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్చు ఇవ్వడంతో.. న్యాయ పరంగా అడ్డంకులను పరిష్కరించుకున్న తర్వాత మాత్రమే మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..