ఏపీలో మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

ఏపీలో మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉన్నాయని..

ఏపీలో మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 4:09 PM

ఏపీలో మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉన్నాయని.. కొత్తగా 16 కాలేజీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలోని ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బుట్టాయగూడెంలో రూ.75 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్షమని అన్నారు. అలాగే ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.