Andhra Pradesh: ఎన్జీవోలకు ఏపీ ప్రభుత్వం షాక్..!
ఏపీలో ఉన్న ఎన్జీవోలకు(నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్) జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ ఎన్జీవో సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. కాగా 2018లో ఏపీ ఎన్జీవోలు తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేయగా.. ఆ సమావేశానికి అప్పటి సీఎం
ఏపీలో ఉన్న ఎన్జీవోలకు(నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్) జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ ఎన్జీవో సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. కాగా 2018లో ఏపీ ఎన్జీవోలు తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేయగా.. ఆ సమావేశానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వారు ఆ సదస్సులో పాల్గొన్నారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడికి తాజాగా ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. సభ్యులు కాని వారు ఎన్జీవోల సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఏపీ ఎన్జీవో బైలాస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయలేదని.. ఎన్జీవోల సంఖ్యను కూడా ఇంత వరకు ప్రభుత్వానికి చెప్పలేదని అందులో పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆ లేఖలో వెల్లడించారు.