విశాఖ మెట్రోలో మరో ముందుడుగు..!

విశాఖ మెట్రో నిర్మాణంలో మరో అడుగు పడింది. మెట్రోలో భాగంగా ట్రామ్ కారిడార్‌ తయారీని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ‌) దక్కించుకుంది.

విశాఖ మెట్రోలో మరో ముందుడుగు..!

విశాఖ మెట్రో నిర్మాణంలో మరో అడుగు పడింది. మెట్రోలో భాగంగా ట్రామ్ కారిడార్‌ తయారీని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ‌) దక్కించుకుంది. మెట్రో రీజియన్ పరిధిలోని 60.20 కిలోమీటర్ల ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన డీటేయిల్డ్‌ రిపోర్టు  సిద్ధం చేయాలని సోమవారం ఏపీ ప్రభుత్వం యూఎంటీసీఎల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు, రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రామ్‌ కార్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రామ్ కార్లు విద్యుదయస్కాంత శక్తితో నడుస్తాయి. వీటికి రైలు ట్రాక్ మార్గం అవసరం లేదు. రోడ్లపైనే ప్రయాణించగలవు. లగ్జరీ బస్‌లాగే ఉండే ట్రామ్‌ కార్లలో 300 నుంచి 500 వరకు ప్రయాణించొచ్చు. రోడ్లపై సెన్సార్ సిగ్నల్ విధానంతో వర్చువల్ ట్రాక్ ఆధారంగా ఇవి నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరానికి తగ్గట్టుగా స్టేషన్‌లలో వీటికి అదనపు బోగీ అనుసంధానం చేయొచ్చు.

Read This Story Also: Big Breaking: సచివాలయంలోని ఆ బ్లాక్ ఉద్యోగులందరికీ హోమ్ క్వారంటైన్..!