Amaravati Lands: అమరావతి భూకేటాయింపులు ఆసక్తికరం.. రేట్లలో వ్యత్యాసంపైనే అందరి ద‌ృష్టి.. తేడాలెందుకని ప్రశ్న

అమరావతి రాజధాని కోసం జరిపిన భూ సేకరణపై తాజాగా మరోసారి చర్చ ఊపందుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అసలు రాజధాని భూసేకరణలో ఏం జరిగిందనే ఆసక్తి సామాన్యుల్లో పెరిగిపోయింది.

Amaravati Lands: అమరావతి భూకేటాయింపులు ఆసక్తికరం.. రేట్లలో వ్యత్యాసంపైనే అందరి ద‌ృష్టి.. తేడాలెందుకని ప్రశ్న
Amaravathi Lands
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 18, 2021 | 3:55 PM

Amaravati Lands allocation is curious: అమరావతి రాజధాని కోసం జరిపిన భూ సేకరణపై తాజాగా మరోసారి చర్చ ఊపందుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అసలు రాజధాని భూసేకరణలో ఏం జరిగిందనే ఆసక్తి సామాన్యుల్లో పెరిగిపోయింది. అసైన్డ్ భూములను చట్టానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం సేకరించిందనేది సీఐడీ నోటీసుల్లో ప్రధాన అభియోగం. కేంద్ర అసైన్డ్ భూముల చట్టం ప్రకారం అసైన్డ్ భూములను కొన్నా, అమ్మినా నేరమే. అయితే, ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడానికి ముందే అసైన్డ్ భూములను సేకరించి, వాటిని ఇతరులకు, ఇతర సంస్థలకు కేటాయించేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి ఏరియాలో ఎవరికి ఎంతేసి భూములను కేటాయించారనేది ఆసక్తికరంగా మారింది.

రాజధాని పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన భూముల ధరలలో వ్యత్యాసాలున్నట్లు గుర్తింంచారు. తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు, కంపెనీలకు కారుచౌకగాను, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధిక ధరలకు భూములు కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు చంద్రబాబు బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్న నందమూరి బసవతారకం అసుపత్రికి ఎకరానికి 25 లక్షల రూపాయల చొప్పున 15 ఎకరాలు కేటాయించారు. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎకరానికి పది లక్షల రూపాయల చొప్పున 50 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌‌కు ఎకరానికి 25 లక్షల రూపాయల చొప్పున 12 ఎకరాలు, బ్రహ్మకుమారీస్‌ సొసైటీకి ఎకరానికి పది లక్షల రూపాయల చొప్పున 10 ఎకరాలు, గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి ఎకరానికి 10 లక్షల చొప్పున 12 ఎకరాలు, విట్‌ యూనివర్సిటీకి ఎకరానికి యాభై లక్షల రూపాయల చొప్పున 200 ఎకరాలు, ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌‌కు యాభై లక్షల రూపాయలకు ఎకరం చొప్పున 150 ఎకరాలు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 50 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున 200 ఎకరాలు కేటాయించింది ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం.

అమృతా యూనివర్సిటీ 50 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున 200 ఎకరాలు, బీఆర్‌ఎస్‌ మెడ్‌సిటీకి ఎకరం 50 లక్షల చొప్పున 100 ఎకరాలు విక్రయించగా.. ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ఎకరానికి లక్షన్నర రూపాయల కాడికి 5 ఎకరాలను 30 ఏళ్ళకు లీజుకి కేటాయించారు. ఆర్‌బీఐకి కోటి రూపాయలకు 11 ఎకరాలు, కాగ్‌‌కు 17 ఎకరాలను 60 ఏళ్ళ లీజుకు కోటి రూపాయలు, ఇండియన్‌ నేవీకి కోటి రూపాయలకు 60 ఏళ్ళ లీజుతో 15 ఎకరాలు కేటాయించారు. ఎఫ్‌సీఐకి నాలుగు కోట్ల రూపాయలకు 1.10 ఎకరం భూమి లీజుకిచ్చారు. ఎల్‌ఐసీకి నాలుగు కోట్ల రూపాయలకు 0.75 ఎకరం భూమి, ఎస్‌బీఐకి నాలుగు కోట్ల రూపాయలకు 3.30 ఎకరాల భూమి, ఆంధ్రా బ్యాంకుకు నాలుగు కోట్ల రూపాయలకు 2.65 ఎకరాల భూమి, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు నాలుగు కోట్ల రూపాయల మొత్తానికి 1.5 ఎకరం భూమి, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌‌కు నాలుగు కోట్ల రూపాయలకు 0.40 ఎకరం భూమి, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీకి నాలుగు కోట్ల రూపాయలకుగాను 1.93 ఎకరాల భూమి, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ నాలుగు కోట్ల రూపాయలకు అర ఎకరం భూమి, సిండికేట్‌ బ్యాంక్‌‌కు నాలుగు కోట్ల రూపాయలకు 1.3 ఎకరాల భూమి, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి రెండు కోట్ల రూపాయలకు 5 ఎకరాల భూమి, ఆప్కాబ్‌ సంస్థకు రెండు కోట్ల రూపాయలకు 4 ఎకరాల భూమిని లీజుకు కేటాయించారు.

ALSO READ: ఆసక్తి రేపుతున్న తిరుపతి బై-ఎలక్షన్.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు.. ఇక ప్రచార సంరంభం