Araku Valley: ప్రకృతి ప్రేమికులకు అలర్ట్.. వంజంగి వెళ్తున్నారా? అయితే, ఈ అంశాలు తప్పక తెలుసుకోండి..

భూతల స్వర్గం లాంటి మేఘాలకొండ వంజంగి ప్రాంతం పై ఆంక్షలు విధించారు అధికారులు. ప్రకృతి సుందర ప్రదేశంలో కొంతమంది గలీజు కార్యకలాపాలకు తెర తీస్తున్నారు.

Araku Valley: ప్రకృతి ప్రేమికులకు అలర్ట్.. వంజంగి వెళ్తున్నారా? అయితే, ఈ అంశాలు తప్పక తెలుసుకోండి..
Vanjangi Hills
Follow us

|

Updated on: Nov 01, 2022 | 7:15 PM

భూతల స్వర్గం లాంటి మేఘాలకొండ వంజంగి ప్రాంతం పై ఆంక్షలు విధించారు అధికారులు. ప్రకృతి సుందర ప్రదేశంలో కొంతమంది గలీజు కార్యకలాపాలకు తెర తీస్తున్నారు. అందమైన పర్యాటక ప్రాంతంలో మద్యం సీసాలతో పాటు.. అనైతిక కార్యకలాపాలు అందరినీ ముక్కున వేలేసుకునిలా చేస్తున్నాయి. దీంతో ఇక.. చీకటి పడితే వాహనాలపై అంక్షలు విధిస్తున్నారు. వంజంగి పైకి మద్యం, ప్లాస్టిక్ వినియోగించడానికి నిషేధించారు. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరిస్తున్నారు అధికారులు.

అల్లూరి జిల్లాలో పాడేరుకు సమీపంలో.. వంజంగి కొండ కోసం తెలియని పర్యాటకులు ఉండరు. భూతల స్వర్గాన్ని తలపించే.. కొండల మధ్యాహ్నం నుంచి పాలసముద్రాన్ని తలపించే మేఘాలను.. చూసి ఆస్వాదిస్తుంటారు పర్యాటకులు. నిత్యం ఈ మేఘాల కూడా చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తుంటారు. వీకెండ్స్ లో రద్దీ అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది. దీంతో పాటు వర్షాకాలం, శీతాకాలంలోనూ పర్యటకుల తాకిడి పెరుగుతుంది. ఎంతలా అంటే వంజంగి కొండను చూసినందుకు వచ్చిన పర్యాటకుల వాహనాలతో.. ఆ ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక వీకెండ్స్ తో పాటు.. శీతాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగిపోతూ ఉంది.

అయితే.. సూర్యోదయాన్ని వంజంగి మేఘాల అందాలు చూడాలంటే తెల్లవారుజామున అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది పర్యాటకులు ముందు రోజు రాత్రి కొండపైకి చేరుకుంటున్నారు. అక్కడే ప్రైవేటు గుడారాలు వేసుకొని.. లేదు అయితే కిరణాల మధ్య పాలసముద్రాన్ని తలపించే మేఘాల ను చూసి ఆస్వాదించేవారు. భూతల స్వర్గంలో కనిపించే ఆ మంచు మేఘాల అందాలను కెమెరాలో బంధిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేసేవారు పర్యటకులు.

ఇవి కూడా చదవండి

సుందర ప్రదేశంలో చీకటి వ్యవహారాలు..

అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యంలోకి రావడంతో టూరిస్టుల రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. దీంతోపాటు కొంతమంది పర్యాటకులు, బ్యాచిలర్లు.. ముందురోజు రాత్రి అక్కడకు చేరుకుని అనైతిక కార్యకలాపాలకు తెర తీస్తున్నారు. ప్రకృతి సుందర ప్రదేశంలో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తున్నడంతో అధికారులు.. కీలక నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. దీనికి తోడు ఇటీవల ఓ పర్యాటక మినీ వాహనం అర్ధరాత్రి బోల్తాపడడంతో.. పదిమందికి పైగా ప్రయాణికులు గాయాలతో ఆసుపత్రికి చేరారు. దింతో వంజంగి హిల్స్ సందర్శనకు వాహనాలపై ఆంక్షలు విధించారు అధికారులు. సాయంత్రం 5.30 తరువాత ఎటువంటి వాహనాలను అనుమతించమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.

ప్లాస్టిక్, మద్యం నో పర్మిషన్..!

దీంతోపాటు కలెక్టర్ ఎస్పీ ఆయా ప్రాంతాలను సందర్శించి.. రాత్రిపూట అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుసుకొని ఆంక్షలు అని మరింత కఠిన తరం చేశారు. దీంతోపాటు.. వంజంగి కొండపై ప్లాస్టిక్ భారీ స్థాయిలో పేరుకుపోవడం, మద్యం బాటిల్ లో విచ్చలవిడిగా కనిపించడంతో.. స్థానికులు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో ఇక అధికారులు కీలక నిర్ణయం తీసుకొని వంజంగి కొండపై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. మద్యాన్ని కూడా పూర్తిగా కొండపై నిషేధించారు అధికారులు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు వాహనాలను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.

ఇటీవల జరిగిన ప్రమాదల నేపద్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డేంజరస్ స్పాట్లను గుర్తించి.. ఆ ప్రాంతాన్ని ప్రమాదాలు జరుగు ప్రాంతంగా (accident prone area) ప్రకటించారు. జిల్లా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.

పర్యాటక ప్రాంతాలను సందర్శనకు వెళ్లొచ్చు.. ఆయా ప్రాంతాల్లోని ప్రకృతి సుందర ప్రదేశాలను ఆస్వాదించాలి.. కానీ మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్లడం.. పర్యాటక ప్రాంతంలో గలీజు కార్యకలాపాలు చేయడం.. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని విఘాతం కలిగించే వ్యవహరించడం సరికాదు. అందుకే ఇన్నాళ్లు.. ఎటువంటి ఆంక్షలు లేకుండా మేఘాలకొండ వంజంగికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తాజాగా జరిగిన ప్రమాదంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.

– ఖాజా, విశాఖపట్నం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..