AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ గురించి అజయ్ కల్లం ఫుల్ క్లారిటీ

రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై రెండు రోజులుగా టీడీపీ సహా ఏపీ ప్రతిపక్షపార్టీలు విమర్శలు, అపోహలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు..

జగన్ గురించి అజయ్ కల్లం ఫుల్ క్లారిటీ
Pardhasaradhi Peri
|

Updated on: Sep 02, 2020 | 6:34 PM

Share

రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంపై రెండు రోజులుగా టీడీపీ సహా ఏపీ ప్రతిపక్షపార్టీలు విమర్శలు, అపోహలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కల్లం అజయ్ రెడ్డి ఈ అంశంపై ఫుల్ క్లారిటటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతులకు ఇచ్చే సబ్సిడీలను నేరుగా వారి నగదు ఖాతాల్లోకి బదిలీ చేయాలని కేంద్రం ముసాయిదాలో వెల్లడించినట్టుగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అయితే ఉచిత్ విద్యుత్ సాధకబాధకాలపై తాము సీఎం జగన్ ముందు ఏకరవు పెట్టినా, ఆయన మాత్రం ఎక్కడా వెనుకంజ వేయలేదని చెప్పారు. ఇది తన తండ్రి తీసుకువచ్చిన పథకం అని, ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించి తీరాల్సిందేనని చెప్పారన్నారు. ఈ క్రమంలో రైతులకు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించాలని నిర్దేశించారని, పాత అకౌంట్లతో అనేక అంశాలు ముడిపడి ఉండే అవకాశం ఉన్నందున తాజా అకౌంట్లతో ఈ పథకం షురూ చేయాలని సీఎం సూచించినట్టు కల్లం పేర్కొన్నారు. డిస్కంలు అమర్చే స్మార్ట్ మీటర్ల రీడింగ్ ను ఫైనాన్స్ విభాగానికి పంపిస్తారని, ఆ సబ్సిడీ మొత్తానికి రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని వివరించారు. ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిగ్గా డిస్కంకు నగదు బదిలీ అవుతుందన్నారు. ఫలితంగా ప్రతి రైతు తనకు ఎంత సబ్సిడీ వస్తుందో తెలుసుకోగలుగుతారన్నారు. ఈ ప్రక్రియలో రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని..పైగా స్మార్ట్ మీటర్లు కూడా ఉచితంగా బిగిస్తారని చెప్పారు.

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?