Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నరకాన్ని తలపిస్తున్నాయ్.. ఏపీ రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు షాకింగ్ కామెంట్స్..

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏంటీ.. రహదారులు ఇంత అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు.. మూడున్నర గంటలు పట్టింది. మా రాష్ట్రం వెనుకబడింది అనుకున్నాను. కానీ.. తీరా చూస్తే ఇక్కడ మరీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి’’ అంటూ ఆంధ్రప్రదేశ్ రహదారులపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: నరకాన్ని తలపిస్తున్నాయ్.. ఏపీ రోడ్లపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు షాకింగ్ కామెంట్స్..
Soyam Bapu Rao On Ap Roads
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2023 | 11:47 AM

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏంటీ.. రహదారులు ఇంత అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు.. మూడున్నర గంటలు పట్టింది. మా రాష్ట్రం వెనుకబడింది అనుకున్నాను. కానీ.. తీరా చూస్తే ఇక్కడ మరీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి’’ అంటూ ఆంధ్రప్రదేశ్ రహదారులపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని.. పాడేరు వాసులను తలచుకుంటుంటే జాలేస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్ నిర్వహించిన ర్యాలీకి ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాపురావు మీడియాతో మాట్లాడుతూ.. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టిందంటూ పేర్కొన్నారు. మా రాష్ట్రం తెలంగాణ వెనకబడి ఉందని అనుకున్నానని కానీ, ఇక్కడి పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయంటూ తెలిపారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని.. పాడేరు వాసులు విశాఖపట్టణం ఎలా వెళ్తున్నారో అర్థం కావడం లేదంటూ పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమంటూ సోయం పేర్కొన్నారు. కొన్ని కొండ గ్రామాల్లో ఇంకా చదువుకోని వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోందని.. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటూ సోయం బాపురావు కోరారు.

ఇవి కూడా చదవండి

కాగా, సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..