Adani Group Ports in India: అదానీ గ్రూప్ చేతికి కృష్ణపట్నం పోర్టు.. పెట్టుబడులు 100 శాతానికి పెంచుకున్న సంస్థ..
Adani Group Ports in India: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్స్ వ్యాపారంగంలో దూసుకుపోతోంది. తాజాగా కృష్ణపట్నం పోర్టులో అదానీ..
Adani Group Ports in India: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్స్ వ్యాపారంగంలో దూసుకుపోతోంది. తాజాగా కృష్ణపట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ లిమిటెడ్.. తమ పెట్టుబడుల్ని వందశాతానికి పెంచుకుంది. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటి వరకూ ఉన్న విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను అదానీ పోర్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 25 శాతం వాటా విలువ 2800 కోట్ల రూపాయలు ఉంటుందని అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు అదానీ పోర్ట్స్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా డీల్‌తో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయింపు అయ్యింది.
కాగా, 2020లో కృష్ణపట్నం పోర్టులో 75శాతం వాటాను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఆ డీల్ విలువ 2020-21 ఆర్థిక సంవత్సరంలో కృష్ణపట్నం పోర్టు విలువను రూ. 13,675 కోట్లుగా అదానీ గ్రూప్ పేర్కొంది. ఇదిలాఉంటే.. కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం పోర్టు యాజమాన్యం మొత్తం అదానీ పోర్ట్స్‌కు బదిలీ అయిన నేపథ్యంలో.. 2025 నాటికి 500 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యాన్ని కృష్ణపట్నం పోర్టు చేరుకుంటుందని అదానీ పోర్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది.
Also read: