CBN Arrest: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు జారీ..

|

Sep 15, 2023 | 12:53 PM

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. దీనిని 19కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్లు తెలిపింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతరబెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

CBN Arrest: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు జారీ..
Chandrababu Naidu
Follow us on

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. దీనిని 19కి వాయిదా వేస్తున్నట్లు విజయవాడ ఏసీబీ కోర్లు తెలిపింది. ఈలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతరబెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు. రాజకీయ కక్షలతోనే దురుద్దేశపూర్వకంగా నన్ను ఈ కేసులోకి లాగారని, సీఎంప్రోద్బలంతో నన్ను ఇరికించారంటూ పిటిషన్‌లో గుర్తుచేశారు టీడీపీ అధినేత. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. అయితే దీపిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

ఇంకా చాలా కేసులున్నాయ్‌: రోజా

మరోవైపు చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్‌ స్కామ్ ఒక్కటే కాదని, మరిన్ని కేసులు బయటకు తీస్తామని హెచ్చరించారు. ‘ ఫైబర్‌గ్రిడ్‌, పట్టిసీమ, రెయిన్‌గన్‌, అమరావతి, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులు లైన్‌లో ఉన్నాయ్‌. ఈ కేసులన్నింటిలోనూ బాబు అరెస్ట్‌ కాబోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులెలా వచ్చాయో లోకేష్‌ చెప్పాలి, ఎలాంటి తప్పు చేయకపోతే ఈడీ దగ్గరకెళ్లి విచారణ అడగొచ్చు కదా’ అని ధ్వజమెత్తారు రోజా.

ఇవి కూడా చదవండి

మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు జిల్లా తిరుమలపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. మారంపల్లి నుంచి చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దింతో పోలీసులకు టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తోపులాటలో క్రింద పడిపోయారు పోలీసులు.కొంతమంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‎కి తరలించారు . మిగతా వారితో టీడీపీ పాదయాత్ర సాగిస్తున్నారు. అదనపు బలగాలతో వారిని అడ్డుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కొనసాగుతోన్న ఆందోళనలు..

 

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..