AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!

ఆన్‌లైన్ బెట్టింగ్​ గేమ్స్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఇంట్లో ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది. తాజాగా నంద్యాల జిల్లాలో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఈక్రమంలోనే సదరు యువకుడు రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఘటన.

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వలలో చిక్కిన మరో యువకుడు.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!
Online Betting
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 27, 2025 | 10:35 AM

Share

బెట్టింగ్‌ కాదది..బ్లాక్‌హోల్..! లోపలికి వెళ్లడమే తప్ప..బయటకు రావడమన్నదే ఉండదక్కడ. వందలు, వేలతో మొదలైన మాయాజూదం..చూస్తుండగానే లక్షలకు చేరుతోంది. ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని.. జేబులు గుల్లవుతాయి. అత్యాశతో కొందరు.. వ్యసనాల బారిన పడి మరికొందరు..ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి నిండు జీవితాలను బలిచేసుకుంటున్నారు. తమతో పాటు తమ కుటుంబాలను సైతం బలిపీఠం ఎక్కిస్తున్నారు.

ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ వలి అనే యువకుడు ప్రవేట్ జాబ్ చేస్తున్నాడు. మంచి జీతం బాగానే ఉందనుకున్న సమయంలో బెట్టింగ్ యాప్‌లకు బానిస అయ్యాడు. అందులో పూర్తిగా కూరుకుపోయి సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బెట్టింగ్ యాప్ ద్వారా 13 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ 6 పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటి నుండి పోయాడు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఆ యువకుడు రాసిన లెటర్ ప్రకారం బెట్టింగ్ యాప్ లకు బానిసను అయ్యానని బెట్టింగ్ వల్ల తీవ్ర అప్పులు చేయడం వల్ల గతంలో పలుమార్లు తన తండ్రి అప్పులు తీర్చాడని పేర్కొన్నాడు. మళ్లీ అప్పులు చేశానని తన తండ్రికి మొహం చూపించలేకనే వెళ్లిపోతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా బంధువులు, కస్టమర్ల దగ్గర ఉన్న బజాజ్ కార్డులలో వారికి తెలియకుండా డబ్బులు తీసుకుని నెల నెల చెల్లిస్తున్నానని వెల్లడించాడు. అయితే ఒక్క నెల చెల్లించకుండా కస్టమర్లకు ఫోన్ వెళుతుందని, అప్పుడు కస్టమర్కు తెలియకుండా డబ్బులు వాడుకున్న సంగతి వారికి తెలుస్తుందని మదనపడ్డాడు. ఇక జైలు శిక్ష పడుతుందని, ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. అలాగే ప్రతి నెల ఎల్ఐసీ చెల్లిస్తున్నానని, చనిపోయిన తర్వాత వచ్చే ఎల్ఐసీ డబ్బులు అందరూ అప్పులు తీర్చాలని లెటర్‌లో రాసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఏడు నెలల క్రితం నిరంజన్ వలికి వివాహం అయింది. ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిరంజన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..