Mangalagiri: మంగళగిరి పెద కొనేరుని పరిశీలించిన నిపుణుల బృందం.. భారీ సొరంగంపై ఏం తేల్చారంటే?
Mangalagiri Tunnel Found: మంగళగిరి పెద కొనేరులో నిపుణుల బృందం పర్యటించింది. కొనేరు పరిసరాలను పరిశీలించిన నిపుణుల బృందం ఏం చెప్పింది? భారీ సొరంగంపై ఏం తేల్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహాస్వామి పెద కొనేరును నిపుణుల బృందం పరిశీలించింది. పన్నెండు మంది అధికారులతో కూడిన సాంకేతిక నిపుణుల బృందం కొనేరు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కోనేరు శ్రీచక్రం ఆకారంలో ఉందని చెప్పారు స్థపతి. ఇదే క్రమంలో కోనేరులోకి వస్తున్న నీటిని పరిశీలించాలని నిపుణుల బృందం సూచించింది. కొనేరులోకి వచ్చేది డ్రెయినేజీ వాటరా? లేక మంచినీరా తేల్చాలన్నారు. అలాగే పడిపోయిన తూర్పు మెట్లను వెంటనే నిర్మించాలని ఆదేశించారు.
మూడు రకాల మట్టి పరీక్షలు చేసి.. కోనేరు చుట్టూ ఆక్రమణలు తొలగించాలని సిఫార్సు చేశారు. కొనేరుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను త్వరలోనే ఇస్తామని చెప్పారు నిపుణుల బృందం. ఇక కోనేరులో ఒక్కో అడుగు నీరు తోడేకొద్దీ.. ఒక్కో ఆసక్తికర కట్టడం బయటపడుతుంది. మొదట ఆంజనేయ స్వామి ఆలయం.. ఆతర్వాత ఆలయం ఎదుట ధ్వజ స్తంభం.. ఆతర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహం, తూర్పు మెట్లపై శివలింగాకారాలు ఇలా ఒక్కోక్కటి బయటపడ్డాయి.
మరింత కిందకు వెళ్తే.. 120 అడుగుల లోతున భారీ సొరంగం ఒకటి బయటపడింది. 5 అడుగుల వెడల్పుతో ఉన్న ఈసొరంగం చేబ్రోలు బ్రహ్మగుడి వరకూ ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆ కోనేరులో బయటపడిన సొరంగం ఎక్కడి వరకు ఉంది? అసలు ఎందుకు నిర్మించారనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.




ఈక్రమంలో ఆలయ అధికారులు మాత్రం స్వామివారి వైదిక కార్యక్రమాలతో పాటు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రకటించారు. కొనేరులో రోజుకో ఆసక్తికర ఘటన వెలుగుచూస్తుండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..