చార్జింగ్‌లో ఉన్న సెల్ ఫోన్ తీద్దామనుకున్నాడు.. కట్ చేస్తే.. విగతజీవిగా మారాడు.. అసలు జరిగిందిదే!
అల్లూరి ఏజెన్సీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టాడు. రాత్రి పడుకుని తెల్లవారి చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ తీసేందుకు అక్కడికి వెళ్ళాడు. సెల్ ఫోన్ పట్టుకున్నాడు. అంతే.. ఏదో కరిసినట్టు అనిపించింది. కట్ చేస్తే నల్లని కట్లపాము.. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టారు. హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అల్లూరి ఏజెన్సీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టాడు. రాత్రి పడుకుని తెల్లవారి చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ తీసేందుకు అక్కడికి వెళ్ళాడు. సెల్ ఫోన్ పట్టుకున్నాడు. అంతే.. ఏదో కరిసినట్టు అనిపించింది. కట్ చేస్తే నల్లని కట్లపాము.. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు డోలి కట్టారు. హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంతలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పాలమామిడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. జి మాడుగుల మండలం పెదబయలు గ్రామానికి చెందిన గెమ్మెలి వాసు.. పాలమామిడి గ్రామానికి చెందిన గిరిజన యువతిని వివాహం చేసుకున్నాడు. అదే గ్రామంలో నివాసం ఉంటున్నాడు. నివాసముంటున్న పాక ఇంట్లో రాత్రి సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి ఉదయాన్నే తీసుకోవడం అలవాటు. ప్రతిరోజు మాదిరిగానే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. మరుసటి రోజు ఉదయం లేచి సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. సెల్ ఫోన్ తీసేందుకు పట్టుకున్నాడు. వెంటనే పక్క నుంచి ఏదో కాటు వేసినట్టు అనిపించింది. పెద్దగా కేకలు వేశాడు.
వాసు అరుపులు విన్న చుట్టుపక్కల వారంతా వచ్చి చూసేసరికి అక్కడ కట్లపాము తిష్ట వేసుకుని కూర్చుంది. అందరూ వచ్చి చూసేసరికి బెదిరిపోయి ఎదురు తాటి చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆత్మ రక్షణలో ఆ పామును చంపేశారు గిరిజనులు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన వాసును తాజంగి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు డోలిలో మోశారు. అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల వరకు టూ వీలర్‌పై ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఆసుపత్రికి తరలించాలని వైద్య సిబ్బంది సూచించారు. నర్సీపట్నం తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు వాసు.
దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. వాసుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం కారణంగానే ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యమై వైద్య సదుపాయం సకాలంలో అందక వాసు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..