AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: విధి నిర్వహణలో సైనికుడి వీర మరణం.. మందుపాతర పేలి జవాన్‌ మృతి..

ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాను వరికుంట సుబ్బయ్య విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాదులు అమర్చిన మందుపాత్రపై కాలు మోపడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుబ్బయ్య మృతి చెందాడు.

Andhra News: విధి నిర్వహణలో సైనికుడి వీర మరణం.. మందుపాతర పేలి జవాన్‌ మృతి..
A Jawan Died In The Line Of Duty When A Landmine Exploded In Prakasham District
Fairoz Baig
| Edited By: |

Updated on: Dec 10, 2024 | 1:54 PM

Share

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాను వరికుంట సుబ్బయ్య విధి నిర్వహణలో ఉండగా ఉగ్రవాదులు అమర్చిన మందుపాత్రపై కాలు మోపడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో జవాను సుబ్బయ్య మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది.. జవాను సుబ్బయ్య మృతదేహాన్ని అతని స్వగ్రామం రావిపాడుకు తరలించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్మీ జవాన్ సుబ్బయ్య మృతితో రావిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలిపోయింది. ఆ సమయంలో ఎల్‌ఓసీ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ వరికుంట సుబ్బయ్య మృతి చెందారు. నియంత్రణ రేఖ దగ్గర థానేదార్ టేక్రి ప్రాంతంలోని ఏరియా డామినేషన్ పెట్రోలింగ్‌లో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వీరమరణం పొందిన జవాను రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవల్దార్‌ వరికుంట సుబ్బయ్యగా గుర్తించారు. వీరమరణం పొందిన సైనికుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ జవాను మృతదేహాన్ని ప్రకాశం జిల్లా రావిపాడులోని అతని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి