Talliki Vandanam: ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలకు తల్లికి వందనం.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..?

రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులకు ఒక్కొక్కరికి రూ 13 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పిన మాట మేరకే నగదు జమ చేసింది..

Talliki Vandanam: ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలకు తల్లికి వందనం.. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా..?
Talliki Vandanam Scheme

Edited By: Srilakshmi C

Updated on: Jun 15, 2025 | 12:26 PM

తిరుపతి, జూన్‌ 15: తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలో తల్లుల్లో ఆనందాన్ని నింపింది ఏపీ సర్కార్. అర్హులందరికీ సూపర్ సిక్స్ లోని తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అర్హులకు ఒక్కొక్కరికి రూ 13 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పిన మాట మేరకే నగదు జమ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే పథకాన్ని అమలు చేసి ఊహించని సహాయం పేద కుటుంబాలకు చేసింది. ఇలా రాష్ట్రంలోని అమ్మల కళ్ళల్లో ఆనందం నింపిన ప్రభుత్వం అన్నమయ్య జిల్లా లోని ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలను తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించింది.

కలకడకు చెందిన హసీనుల్లాకు నలుగురు కొడుకులు కాగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న నలుగురు తల్లుల సంతానం 12 మందికి తల్లికి వందనం డబ్బులు జమ చేసింది. 12 మంది పిల్లలకు గాను మొత్తం రూ.1.56 లక్షల నగదు బదిలీ చేసింది. కలకడకు చెందిన టి.నసీన్, బి.ముంతాజ్, ఇరానీ, ఆసియా అనే తల్లుల అకౌంట్ లలో నగదు జమ అయింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. పేదరిక కుటుంబానికి ఒకేసారి తల్లికి వందనం పేరుతో ఒకే ఇంటిలో 12 మందికి రూ.1.56లక్షలు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా కలకడ మండలంలోనే తల్లికి వందనం పథకం కింద పెద్ద మొత్తంలో నగదు జమ అయిన కుటుంబంగా నిలబడింది. ఈ విషయాన్ని X లోనూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొనడం విశేషం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత ఆదాయం జనాభాను పెంచండి పిలల్ని కనండని సీఎం చెప్పినట్లు కలకడ లో ఒక కుటుంబానికి తల్లికి వందనం పథకం ఊహించని ఆదాయాన్ని సమకూర్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.