Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రియురాలిని ఇంజక్షన్‌తో పొడిచిన సైకో ప్రియుడు.. అసలేం జరిగిందంటే ?

బీటెక్ చదువుతున్న యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తూ ఆమె పొట్టలో ఇంజక్షన్‌ దింపడం కలకలం రేపింది. గత మూడేళ్లుగా ఆ యువకుడు ఆమె వెంటపడుతున్నాడు. దిశలో కేసు పెట్టినా వేధించడం ఆపలేదు. చివరికి ఆమె పొట్టలో ఇంజక్షన్ దించి పరారయ్యాడు. ఇప్పుడు ఆ ఇంజక్షన్‎లో ఏముందని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని ఒక ప్రవేటు హాస్టల్ ఉంటూ యువతి బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది.

Andhra Pradesh: ప్రియురాలిని ఇంజక్షన్‌తో పొడిచిన సైకో ప్రియుడు.. అసలేం జరిగిందంటే ?
Crime Scene
Follow us
T Nagaraju

| Edited By: Aravind B

Updated on: Sep 13, 2023 | 1:47 PM

బీటెక్ చదువుతున్న యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తూ ఆమె పొట్టలో ఇంజక్షన్‌ దింపడం కలకలం రేపింది. గత మూడేళ్లుగా ఆ యువకుడు ఆమె వెంటపడుతున్నాడు. దిశలో కేసు పెట్టినా వేధించడం ఆపలేదు. చివరికి ఆమె పొట్టలో ఇంజక్షన్ దించి పరారయ్యాడు. ఇప్పుడు ఆ ఇంజక్షన్‎లో ఏముందని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని ఒక ప్రవేటు హాస్టల్ ఉంటూ యువతి బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. మొదటి సంవత్సరంలో ఆమెకు సిటిజెన్ ఆసుపత్రిలో పనిచేసే నాగ బాలాజీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొద్దీ కాలంపాటు ప్రేమించుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె తోటి విద్యార్ధులతో మాట్లాతుండటంతో అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఆమె అతనితో దూరంగా ఉంటూ వస్తూ ఉంది. ఈక్రమంలోనే ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు.

దీంతో ఆమె దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత కూడా నాగ బాలాజీ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ యువతి వెంటపడుతూనే ఉన్నాడు. నిన్న ఆమె కాలేజ్ బస్సు మిస్ కావడంతో ఆర్టీసి బస్సుల్లో కాలేజీకి వెళ్లడాన్ని గమనించి ఆమెను వెంబడించాడు. కాలేజ్ దగ్గర యువతి దిగగానే ఆమెను తనతో పాటు రావాలంటూ బెదిరించాడు. దీంతో ఆమె అతనితో పాటు ఆటో ఎక్కింది. ఆటో గుంటూరు నగరంలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే గమనించిన ఆమె ఆటో దిగే ప్రయత్నం చేసింది. అయితే ఆటో దిగవద్దని దిగితే ఇంజక్షన్ తో పొడుస్తానని బెదిరించాడు. అయినా సరే ఆమె దిగే ప్రయత్నం చేయడంతో ఇంజక్షన్ ఆమె పొట్టలో దించాడు.

ఇవి కూడా చదవండి

ఆమె వెంటనే అరండల్ పేట పోలీస్ స్టేషన్ లోకి వెళ్లింది. ఇది గమనించిన పోలీసులు నాగ బాలాజీ వెంట పడగా పారిపోయాడు. అయితే ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగ బాలాజీ ఆమెకు ఇంజక్షన్ ద్వారా ఏం ఇంజెక్ట్ చేశాడో అన్న భయం ఆమె బంధువుల్లో నెలకొంది. ఆమెను ఆసుపత్రకి తరలించగా ఇరవై నాలుగు గంటల పాటు అబ్జెర్వేషన్ లో ఉంచి ఢిశ్చార్జ్ చేశారు. నాగ బాలాజీ పట్టుబడితే గాని ఏం ఇంజెక్ట్ చేశాడో తెలియదని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతనాకి సెలైన్ వాటరే ఇంజెక్ట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. కేవలం ఆమెను తనతో తీసుకెళ్లడానికి బెదిరించేందుకే ప్రయత్నం చేసి ఉంటాడని అనుకుంటున్నారు. నాగ బాలాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు