Andhra Pradesh: నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న లోన్ యాప్‌.. ఒత్తిడి భరించలేక

| Edited By: Narender Vaitla

Aug 24, 2023 | 7:24 PM

లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రుణాలు ఇస్తామని ఎట్రాక్ట్ చేసి ఆపై.. తీసుకున్న లోన్ అంతా చెల్లించినా వేధించి మానసిక ఒత్తిడి గురిచేస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదై.. నిందితులను అరెస్టులు చేసినప్పటికీ.. ఇంకా ఆ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా విశాఖలో యువకుడు లోని యాప్ నిర్వహకుల వేధింపులకు...

Andhra Pradesh: నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న లోన్ యాప్‌.. ఒత్తిడి భరించలేక
Andhra Pradesh
Follow us on

విశాఖలో ఓ యువకుడు ఉన్నట్టుండి ఇంటి నుండి వెళ్లిపోయాడు. స్నేహితుడు ఇంటికి వెళ్తానని చెప్పడంతో సరే అన్నారు ఇంట్లో వాళ్ళు. ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన ఆ యువకుడు.. డిప్రెషన్ లోనే ఉన్నాడు. ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు మెడ బిగించుకున్నాడు. రూమ్ కు వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ ఉన్నాడు. అప్పటికే ప్రాణాలు పోయాయి. కుటుంబ సభ్యులు స్నేహితులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. అసలు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునే అంత ఆపద ఏంటి..? పోలీసులకు కూపి లాగితే.. లోన్ యాప్ వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రుణాలు ఇస్తామని ఎట్రాక్ట్ చేసి ఆపై.. తీసుకున్న లోన్ అంతా చెల్లించినా వేధించి మానసిక ఒత్తిడి గురిచేస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదై.. నిందితులను అరెస్టులు చేసినప్పటికీ.. ఇంకా ఆ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా విశాఖలో యువకుడు లోని యాప్ నిర్వహకుల వేధింపులకు తీవ్ర మానసిక వేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

డిప్రెషన్ లోకి వెళ్లిపోయి..

విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని.. కంచరపాలెం కప్పరాడ ప్రాంతంలో హేమంత్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఓ ప్రయివేట్ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. హేమంత్ లోన్ యాప్ లో కొంత లోన్ తీసుకొని తన అవసరాలకు వినియోగించుకున్నాడు. కొంతవరకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించిన.. హేమంత్.. ఆ తర్వాత రుణం చెల్లించడంలో ఆలస్యమైంది. దీంతో ఇక లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు మొదలయ్యాయి. బాకీని వడ్డీతో సహా చెల్లించుకుంటే.. ఫోటోలను మార్ఫ్‌ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తామని.. కుటుంబ సభ్యుల పరువు కూడా తీస్తామని హెచ్చరించారు. దీంతో తీవ్ర ఆందోళన ఆవేదన గురైన హేమంత్.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఈనెల 16న తన స్నేహితుడి ఇంటికి వెళ్తానని చెప్పాడు. అక్కడ స్నేహితుడు ఇంటికి వెళ్లి రాత్రి ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవి కూడా చదవండి

భద్రక్ లో ఓ నిందితుడు..

మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కంచరపాలెం పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్లో విశ్లేషించారు. దీంతో లోన్ యాప్ లో హేమంత్‌ రుణం తీసుకున్నట్టు గుర్తించారు. కేసును సైబర్ క్రైమ్ పోలీసులు.. టెకప్ చేసి మొబైల్ ను విశ్లేషించి.. నిందితులను ట్రాక్ చేస్తున్నారు. ఒరిస్సాలోనే భద్రక్ నుంచి ఒక నిందితుడిని పట్టుకొని విశాఖ తీసుకొచ్చారు పోలీసులు. మరి కొంతమందిని కూడా ట్రాక్ చేస్తున్నామని అన్నారు సిపి త్రివిక్రమ్ వర్మ.

పోలీసులు సూచిస్తున్నది ఇదే..

లోన్ యాప్ ఆగడాలపై ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ టీం పనిచేస్తుంది. గతంలోను విశాఖ కేంద్రంగా అనేక కేసులు నమోదైన నేపథ్యంలో.. పోలీసుల ప్రత్యేకంగా ఈ యాప్స్ పై దృష్టి సారించారు. సాధ్యమైనంతవరకు లోన్ యాప్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..