Andhra Pradesh: దారి కాచి మాటు వేసి.. బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్..
మహిళలు, చిన్నారులు, బాలికలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కొందరిలో మార్పు రావడం లేదు. చట్టాలు కఠినతరం చేసినా.. శిక్షలు విధిస్తున్నా..

మహిళలు, చిన్నారులు, బాలికలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కొందరిలో మార్పు రావడం లేదు. చట్టాలు కఠినతరం చేసినా.. శిక్షలు విధిస్తున్నా క్రూరంగా ప్రవరిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కాట్రేనికొన మండలం మత్యకార గ్రామం చిర్రయానంలో 17 ఏళ్ల బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ నెల 6 వ తేదీన మంచి నీటి కుంట వద్దకు నీటికోసం వెళ్లిన 17 ఏళ్ల బాలికను అడ్డుకున్న యువకులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలిక.. జరిగిన దురాగతాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. విషయం అంతా తెలిసిపోవడంతో సదరు యువకుల బంధువులు.. నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. బాధితురాలి కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పు కప్పిపుచ్చే ప్రయత్న చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
చివరకు ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి, ముమ్మిడివరం సీ.ఐ.జానకీరామ్ గ్రామంలో విచారణ చేపడుతున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..