అంబులెన్స్‎లో వెళ్లి ఆదర్శంగా నిలిచిన 90 ఏళ్ల వృద్దుడు.. ఎందుకో తెలుసా..

| Edited By: Srikar T

May 14, 2024 | 10:25 AM

ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించిన ఒక వజ్రాయుధం. ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును వినియోగిస్తే కదా దానికి విలువ. నేనొక్కడినే ఓటేయకపోతే ఏమవుతుందిలే అనుకునే వాళ్ళు ఇంకా లేకపోలేదు. కానీ ఈసారి ఓటింగ్ సరళి చూస్తే ఓటర్లలో మార్పు చైతన్యం స్పష్టంగా కనిపించింది.

అంబులెన్స్‎లో వెళ్లి ఆదర్శంగా నిలిచిన 90 ఏళ్ల వృద్దుడు.. ఎందుకో తెలుసా..
Old Man
Follow us on

ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించిన ఒక వజ్రాయుధం. ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును వినియోగిస్తే కదా దానికి విలువ. నేనొక్కడినే ఓటేయకపోతే ఏమవుతుందిలే అనుకునే వాళ్ళు ఇంకా లేకపోలేదు. కానీ ఈసారి ఓటింగ్ సరళి చూస్తే ఓటర్లలో మార్పు చైతన్యం స్పష్టంగా కనిపించింది. కొత్తగా ఓటు పొందిన యువత సరే సరి.. మహిళలు కూడా ఓటింగ్లో మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇక వయసు మీద పడిన పండు ముసలి వాళ్లు కూడా పోలింగ్ బూతుల వైపు బయలుదేరారు. ఎవరి సహాయం తీసుకునో.. కుటుంబ సభ్యులతో కలిసివచ్చో.. నడవడానికి ఓపిక లేకపోతేనేం కనీసం వీల్ చైర్ మీద అయినా వచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. కనీసం మంచం పై నుంచి లేవలేక.. నడవలేక కదలలేని స్థితిలో ఉన్న 9 పదుల వయసు నిండిన ఓ పెద్దాయన.. ఓటు కోసం వణుకుతూ ఉన్నప్పటికీ సత్తువ తెచ్చుకున్నారు. తనకు పోలింగ్ బూత్‎కు తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. ఇక అంబులెన్స్‎ను రప్పించారు.

సతీమణితో కలిసి..

విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పెద్ద వాల్టర్‎లో నివాసం ఉంటున్నారు పెద్దిరెడ్డి సుబ్బారావు. రిటైర్డ్ రైల్వే అధికారి. వయసు 90 ఏళ్లు. భార్య విజయ మహాలక్ష్మి. ఆమె వయసు కూడా 80కి పైనే..! వయసు మీద పడడంతో.. దాదాపుగా మంచంపైనే ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ఎప్పటికప్పుడు దేశంలో జరిగే పరిణామాలను గమనిస్తూనే ఉంటారు. అడిగి తెలుసుకుంటూనే ఉంటారు. అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉంటారు. తనకు ఏదైనా ఇంకా తెలుసుకోవాలనిపిస్తే ఇద్దరు కొడుకులు కూడా పిలిపించి మాట్లాడతారు.

ఆంబులెన్స్‎లో పోలింగ్ కేంద్రానికి..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు నేను సైతం అన్నారు పెద్దాయన సుబ్బారావు. విషయాన్ని పిల్లలతో చెప్పడంతో.. మరి పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లేది ఎలా..? ఫోర్ వీలర్‎లు ఉన్నప్పటికీ.. వణుకుతూ ఆరోగ్యం శరీరం సహకరించకపోవడంతో.. వాటిలో ఎక్కి ప్రయాణించడం కష్టతరమే. ఎందుకంటే.. కారులో కూర్చునే అవకాశం కూడా లేదు. దీంతో ఇక వాహనంలో ఎక్కి ప్రయాణించేందుకు వీలుగా ఉండే అంబులెన్స్ను ఎంచుకున్నారు. అంబులెన్స్‎ను పిలిపించి.. ఎక్కించారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పెదవాల్తేరులోని కంటి హాస్పిటల్ పక్కనే ఉన్న గవర్నమెంట్ హై స్కూల్‎కు వెళ్లారు. అక్కడ బూత్ నెంబర్ 152లో ఓటు వేశారు. తన సతీమణి విజయ మహాలక్ష్మితో కూడా ఓటు వేయించారు.

ఇవి కూడా చదవండి

గత 70 ఏళ్లుగా మిస్ కాకుండా..

పెద్దిరెడ్డి సుబ్బారావు.. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నిర్విరామంగా ఓటు వేస్తున్నారు. దాదాపుగా 70 ఏళ్ళుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఉత్సాహంగా ఓటింగ్‎లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని అంటున్నారు సుబ్బారావు కుమారుడు డాక్టర్ పివి సుధాకర్. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తాను ఓటు వేస్తాను.. వేసి తీరుతాను అన్నట్టుగా ఉంటారు ఈ పెద్దాయన. నిజంగా ఇటువంటి వారి వల్లే కదా.. అందరిలో చైతన్యం వచ్చేది.. ఓటుపై స్పూర్తిని రగిల్చేది. ఆయనను చూసిన వాళ్లంతా హ్యాట్సాఫ్ పెద్దాయన..! అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..