Nellore: కలలు చెదిరి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు.. ఈ పాపం ఎవరిది..?

నెల్లూరు జిల్లాలో ఘోరో రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర శనివారం తెల్లవారుజామున మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. 15 మందికి గాయాలయ్యాయి.

Nellore: కలలు చెదిరి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు.. ఈ పాపం ఎవరిది..?
Road Accident
Follow us

|

Updated on: Feb 10, 2024 | 7:25 PM

నెత్తుటి దారులు.. ఛిద్రమౌతున్న జీవితాలు.. చిన్న నిర్లక్ష్యానికి… బలవుతున్న నిండు ప్రాణాలు..  కలలు చెదిరి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు.. ఈ పాపం ఎవరిది..?. అవును… రహదారులు రక్తమోడుతున్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణం అవుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలనే కకావికలం చేస్తున్నాయి. నిండు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలి తీసుకుంది.

ఓ ప్రైవేట్‌ బస్సు 43 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో.. చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తోంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా దగ్గరకు రాగానే.. రోడ్డుకు అటువైపు.. పశువుల లోడ్‌తో ఉన్న లారీని… వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొట్టింది.. దీంతో ఆగివున్న లారీ డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీకొట్టి.. ఎదురుగా వస్తున్న ట్రావెల్‌ బస్సుపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. రెండు లారీల డ్రైవర్లు, అలాగే బస్సు డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే చనిపోయారు.. మరో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగరు చనిపోగా.. 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదస్థలిని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.  మరి కొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనగా.. ఈ దుర్ఘటన జరగడంతో కన్నీరుమున్నీరవుతున్నారు బాధితుల కుటుంబసభ్యలు.

అతివేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యం.. ఏదైతేనేం… రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాల్లో చీకటి నింపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ