YSR Jayanthi: జననేత తమ వాడే అంటున్న నాలుగు పార్టీలు.. ఇంతకీ ఆయన ఎవరికి సొంతం..?

ఆయనొక్కడే. కానీ ఆయన పేరు నాలుగు పార్టీల్లో మారుమోగుతూ ఉంటుంది. ఆయనకున్న క్రేజ్‌ను ఆయా పార్టీలు సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. అవును.. ఆ ఒక్కడిని ఓన్‌ చేసుకునేందుకు నాలుగు...

YSR Jayanthi: జననేత తమ వాడే అంటున్న నాలుగు పార్టీలు.. ఇంతకీ ఆయన ఎవరికి సొంతం..?
Ysr Lives On
Follow us

|

Updated on: Jul 08, 2021 | 9:28 PM

ఆయనొక్కడే. కానీ ఆయన పేరు నాలుగు పార్టీల్లో మారుమోగుతూ ఉంటుంది. ఆయనకున్న క్రేజ్‌ను ఆయా పార్టీలు సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. అవును.. ఆ ఒక్కడిని ఓన్‌ చేసుకునేందుకు నాలుగు పార్టీలు పోటీ పడడం… రాజకీయ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయనే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. కార్యకర్త నుంచి సీఎం వరకు ఎదిగిన వైఎస్‌ ప్రస్థానం.. ప్రస్తుతం నాలుగు పార్టీల్లో ప్రతిధ్వనిస్తోంది. వెఎస్సార్ అంటే ఎవరి వాడు అంటే.. అందరి వాడు అన్నట్టుగా చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఒకరిని మించి ఒకరు ఆయన జయంతి వేడుకలను పోటీ పడి నిర్వహించాయి. తెలుగురాష్ట్రాల్లో వైఎస్సార్ 72వ జయంతిని పోటాపోటీగా జరిపాయి.

వైఎస్‌ఆర్‌ అంటే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే వైఎస్‌ఆర్‌గా చూసేశారు. పాదయాత్రతో ఆయన మరింత క్రేజ్‌ పెరిగింది. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తిరుగులేని నేతగా ఎదిగి.. అకాల మరణం చెందారు. ఆయన మరణం తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు రాష్ట్రాలుగా ఆవిర్బావం అయితే.. నాలుగు రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి. ప్రధాన కాంగ్రెస్‌ ఏపీ, తెలంగాణగా విడిపోతే… వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా వైఎస్‌ఆర్‌ సీపీ పెట్టుకోగా.. వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ అంటూ తాజాగా ముందుకు వచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ చిత్రపటానికి నివాళులర్పించి.. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. పంజాగుట్ట సెంటర్ దగ్గర కూడా పెద్దసంఖ్యలో నివాళులర్పించారు. ఏపీ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ కూడా జననేత జయంతి వేడుకలను ఘనంగా జరిపింది. వైఎస్‌ జయంతిని ప్రత్యేకంగా రైతు దినోత్సవంగా జరుపుకుంది. వైఎస్‌ రైతు పక్షపాతి అన్న కోణంలో.. ఏపీ సర్కార్‌ తమది రైతు సర్కార్‌గా చెప్పుకునే యత్నం చేసింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అంటూ గుర్తుచేశారు.

వైఎస్‌ షర్మిల కూడా కొత్త పార్టీతో ముందుకు వచ్చారు. తన తండ్రి జయంతి రోజు తెలంగాణ వైఎస్‌ఆర్‌ పార్టీని ఆవిర్భవించారు. ముందుగా ఇడుపులపాయలోని తన తండ్రి సమాధికి నివాళులర్పించి .. హైదరాబాద్‌ వచ్చి కొత్త పార్టీని స్థాపించారు. అంతేకాదు.. ఏపీ కాంగ్రెస్‌ కూడా వైఎస్‌ను మరిచిపోలేదు. ఆయన తమ పార్టీ సింబల్‌గా చెప్పుకునే యత్నం చేసింది. ఇలా నాలుగు పార్టీలు.. ఒకే వ్యక్తిని ఓన్‌ చేసుకుంటూ.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా… తనవారు అనకున్న అందరికీ ఆయన అయినవాడే, ఆప్తుడే అంటున్నారు వైఎస్సార్ అభిమానులు.

Also Read: రొయ్యల చెరువులో దొంగలు పడ్డారు.. కట్ చేస్తే మాములు ట్విస్ట్ కాదు…

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోన్న పిడుగులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Latest Articles