Andhra Pradesh: అర్ధరాత్రి గ్రామ శివారు నుంచి శబ్దాలు.. అనుమానంతో వెళ్లి చూడగా..

గుట్టుగా గుప్త నిదుల కోసం వేట మొదలు పెట్టిన కేటుగాళ్ళు.. అర్దరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపారు. దాదాపు పది అడుగుల గొయ్యి తవ్వారు. అర్దరాత్రి గ్రామ శివారులో జేసీబీతో డ్రిల్లింగ్, తవ్వకాలు చేస్తున్న శబ్దాలు గ్రామస్థుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. అర్ధరాత్రి ఈ శబ్దాలు ఏంటని చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు. గుట్టుగా గుట్టల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారాన్ని గ్రామస్థులు పోలీసులకు ఇచ్చారు.

Andhra Pradesh: అర్ధరాత్రి గ్రామ శివారు నుంచి శబ్దాలు.. అనుమానంతో వెళ్లి చూడగా..
Treasure Hunting

Edited By: Surya Kala

Updated on: Oct 05, 2023 | 12:09 PM

కష్టపడకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలి.. బంగారం, విలువైన వస్తులు సొంతం చేసుకుని భారీగా డబ్బులు సంపాదించాలని.. అడ్డదారిలో అందలం ఎక్కాలనే కోరికతో ఎటువంటి పనికైనా సిద్ధపడుతున్నారు. పూర్వకాలం నాటి గుప్త నిధులు దొరికితే చాలు.. కోటీశ్వరుడు అయిపోవచ్చు అన్న తలంపు ఎక్కువగా ఉన్నట్లు పలు సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుప్తనిధుల తవ్వకాలకు బడి, గుడి , చెరువు అన్న తేడా లేకుండా పోయింది. గుప్త నిధులు దొరుకుతాయన్న అత్యాశకు వెళ్లి నలుగురు కటకటాల పాలైన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని అమరాపురంలో చోటుచేసుకుంది.

 

గుట్టుగా గుప్త నిదుల కోసం వేట మొదలు పెట్టిన కేటుగాళ్ళు.. అర్దరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపారు. దాదాపు పది అడుగుల గొయ్యి తవ్వారు. అర్దరాత్రి గ్రామ శివారులో జేసీబీతో డ్రిల్లింగ్, తవ్వకాలు చేస్తున్న శబ్దాలు గ్రామస్థుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. అర్ధరాత్రి ఈ శబ్దాలు ఏంటని చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు. గుట్టుగా గుట్టల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారాన్ని గ్రామస్థులు పోలీసులకు ఇచ్చారు. ఇంకే ముంది తవ్వకాలు జరుపుతున్న నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

జిల్లాలోని అమరాపురం మండలం పేలుబండ చెరువు సమీపంలో అర్దరాత్రి గుప్త నిధుల కోసం జెసిబితో తవ్వకాలు జరిపుతున్న విషయం కలకలం రేపుతోంది. తవ్వకాలు చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. కేటుగాళ్ళు అయిన కాంతరాజు, మంజునాథ్, మూర్తి, జెసిబి డ్రైవర్ రాములుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..