AP News: కడప అసెంబ్లీ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిన మహిళ.. 30 ఏళ్ల తర్వాత..
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న మైనారిటీలను కాదని మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించారు. గత 35 ఏళ్లుగా ఇక్కడ మైనారిటీలదే హవా ఏ పార్టీ తరపున గెలిచిన మైనారిటీలే గెలుస్తూ వచ్చారు కానీ ఈసారి వారిని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ అభ్యర్థిని...
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న మైనారిటీలను కాదని మొదటిసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించారు. గత 35 ఏళ్లుగా ఇక్కడ మైనారిటీలదే హవా ఏ పార్టీ తరపున గెలిచిన మైనారిటీలే గెలుస్తూ వచ్చారు కానీ ఈసారి వారిని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ అభ్యర్థిని ఇక్కడ గెలిపించి చరిత్రను తిరగరాశారు కడప ఓటర్లు.
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిగా కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వైసిపి తమ అధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చాయి. అయితే మొదటిసారిగా మహిళా అభ్యర్థి ఇక్కడ గెలిచి చరిత్ర సృష్టించారు టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. 18 వేల ఓట్ల పైచిలుక మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇప్పటివరకు అన్ని పార్టీలు ఈ సీటును మైనారిటీలకే కేటాయిస్తూ వచ్చాయి. అప్పుడప్పుడు టిడిపి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చినప్పటికీ గెలుపు సాధ్యం కాలేదు.
అయితే ఈసారి టిడిపి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించి అందులోనూ మహిళకు సీడ్ కేటాయించటంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దాదాపు 70 వేల పైచిలుకు మైనారిటీ ఓట్లు ఉన్నప్పటికీ 35 ఏళ్ల మైనారిటీల ఆధిపత్యానికి చెక్ పడింది. ఈ సారి మెజార్టీ ఓటర్లు మాధవి రెడ్డి వైపు నిలిచి ఆమెకు విజయాన్నందించారు. ఇలా కడప నియోజకవర్గ చరిత్రలో తొలిసారి నెగ్గిన మహిళా అభ్యర్థిగా మాధవి చరిత్ర సృష్టించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..