TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులో టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. 2026 నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా వీటిని ఆన్‌లైన్‌లో పొందవచ్చని తెలిపింది. టీటీడీ పరిపాలనా భవనాల ఎదురుగా ఉన్న సేల్స్ కౌంటర్‌లో వీటిని ఆఫ్‌లైన్‌లోనూ పొందవచ్చని తెలిపింది.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా శ్రీవారి దేవస్థానం పరిపాలనా భవనాల ఎదురుగా ఉన్న సేల్స్ కౌంటర్, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ధ్యాన మందిరం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాలు, తిరుచానూరులో ఉన్న తితిదే పబ్లికేషన్ స్టాల్స్‌లలోనూ ఈ క్యాలెండర్స్, డైరీలు అందుబాటులో ఉన్నాయని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా ఇవి అందుబాటులో ఉండనున్నట్టు టీడీడీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో ఇవి భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌లో హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయాల్లో, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, వేలూరు, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని టీటీడీ కల్యాణ మండపాల్లో ఈ క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
ఆఫ్‌లైన్‌లో వీటిని పొందలేని భక్తులు దేవస్థానం టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని.. ఇలా బుక్ చేసుకున్న వారికి పోస్ట్ ద్వారా డైరీలు,క్యాలెండర్లను అందుతాయని పేర్కొంది. వాటిని www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా పొందవచ్చని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




