AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంటి తలుపులు మూసి.. నోట్లో వస్త్రాలు కుక్కి.. అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం..

అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసి నిండితుడు సురేష్ పారిపోయాడు. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో ఘటన జరిగింది. గతంలో ఇదే బాలికను వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చాడని చెబుతున్నారు బంధువులు..

Andhra Pradesh: ఇంటి తలుపులు మూసి.. నోట్లో వస్త్రాలు కుక్కి.. అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం..
Crime News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 07, 2024 | 1:31 PM

Share

అనకాపల్లి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేసాడు. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసి నిండితుడు సురేష్ పారిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిపోయారు. నానమ్మ మరో ఇంట్లో ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన బాలిక.. నానమ్మ ఇంటికి వెళ్లి అక్కడ తాళాలు తీసుకుని… తన ఇంటికి వెళ్ళింది. కాసేపటికి నానమ్మ కాంతం కూడా మనమరాలు వెళ్లిన ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఇంటి తలుపులు వేసి ఉండడాన్ని గమనించింది నానమ్మ. కాసేపు వేచి చూసి.. తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి… కాస్త గట్టిగా అరిచింది. దీంతో తలుపులు తీసిన నిండితుడు.. బాలిక నాన్నమ్మ కాంతంను తోసి పారిపోయాడు. లోపలకు వెళ్లి చూసేసరికి ఆ రక్తపు మడుగులో పడి ఉంది ఆ బాలిక. ఘటన స్థలంలోనే ప్రణాలు కోల్పోయింది. గత కొంతకాలంగా వెంటపడుతున్న సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నానమ్మ పోలీసులకు చెప్పింది.

వాడే చంపేసాడు..

ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే.. చాలా కాలం నుంచి ప్రేమ పేరుతో వెంటపడుతున్న సురేష్ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడు స్వస్థలం అనకాపల్లి జిల్లా కసింకోట. నిందితుడి అమ్మమ్మ గ్రామానికి వస్తూ బాలిక పై కన్నెశాడని చెబుతున్నారు. ముందు వేధించి, బెదిరించి, భయపెట్టి జైలుకెళ్లిన సురేష్ .. బెయిల్ పై బయటకు వచ్చి హత్య చేసాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చెస్తున్నారు.

నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు..

సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగారు. క్లూస్ టీం తో ఆదరలను సేకరించే పనిలో పడ్డారు. బాలికను నోట్లో వస్త్రాలు కుక్కి ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే నిందితుడిపై కేసు కూడా నమోదు అయినట్టు తెలుస్తోంది. జైలు కెళ్ళి.. బెయిల్ పై బయటకు వచ్చాడని అంటున్నారు.

సమగ్ర విచారణకు హోం మంత్రి ఆదేశం..

ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు హోం మంత్రి. సమగ్ర విచారణకు ఆదేశించారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. నిందితుడు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Follow Us
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..