Vizag: రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు.. ఒక్కసారిగా ఆగిన జాగిలం.. తెరిచి చూడగా

| Edited By: Ravi Kiran

Oct 23, 2024 | 5:27 PM

విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు 10 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్నిఫర్ డాగ్ సీజర్ గుర్తించడంతో ఈ స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా..

Vizag: రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు.. ఒక్కసారిగా ఆగిన జాగిలం.. తెరిచి చూడగా
Vizag
Follow us on

అది విశాఖ రైల్వే స్టేషన్.. వచ్చే పోయే రైళ్లతో ట్రాక్ బిజీబిజీగా ఉంది. ప్రయాణికులతో సందడిగా మారింది. ఈ సమయంలో నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ప్లాట్‌ఫార్మ్‌పైకి వెళుతూ.. వెళుతూ.. ఆ పోలీసు జాగిలం ఒక్కసారిగా ఆగింది. ఎందుకు ఆగిందని అనుమానం వచ్చింది పోలీసులకు.. ఎంతగా రమ్మన్నా ఆ జాగిలం అక్కడ నుంచి కదలడం లేదు. దీంతో పోలీసులు అక్కడ చెక్ చేశారు. ఇంకేముంది గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ జరిగిపోతోంది. డాగ్ చాకచక్యంతో ఆ గుట్టు అంతా బయటపడింది.

ఇది చదవండి: లక్షకు రూ. 3 లక్షలు.. పైగా ప్రతీ ఏటా రూ. 12 వేలు.. మ్యాజిక్ చేసే మల్టీబ్యాగర్ స్టాక్

దాదాపుగా 10:30 కిలోల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తదుపరి చర్యల కోసం రైల్వే పోలీసులకు అప్పగించారు. తనిఖీలు చేపట్టి గంజాయి గుర్తించిన నార్కో టిక్ స్నిఫర్ డాగ్ సీజర్‌ను, డాగ్ హ్యాండ్లర్ రాంప్రసాద్‌ను అభినందించారు సీపీ బాగ్చి. విశాఖ సిటీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నిర్వీర్యం చేయడంలో భాగంగా సీపీ.. ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్, జీవిఎంసీ కమిషనర్ సహకారంతో అదనంగా 8 స్నిఫర్ డాగ్స్ సిద్ధం చేశారు. వాటిని శిక్షణ నిమిత్తం కేనైన్ ట్రైనింగ్ సెంటర్‌కు పంపారు. ఇవి అతి త్వరలో అందుబాటులోకి వచ్చి నగరంలో గంజాయి ఇతర నార్కోటిక్ డ్రగ్స్ కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తాయని సీపీ కార్యాలయం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మంచు కొండల్లో అదో మాదిరి వింత ఆకారం.. విషయం తెలిస్తే.. అయ్యబాబోయ్.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..