Tungabhadra: పగిలిన తుంగభద్ర పైప్‌లైన్.. 50 ఎకరాల్లో నీట మునిగిన పంట!
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పైప్‌లైన్ లీక్ కావడంతో రెండు రోజుల నుంచి నీరు వృధాగా పోతోంది. దీని కారణంగా దాదాపు 50 ఎకరాల వరకు పంట నీట మునిగింది. నీట్లో పత్తిపంట మునిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పైప్‌లైన్ లీక్ కావడంతో రెండు రోజుల నుంచి నీరు వృధాగా పోతోంది. దీని కారణంగా దాదాపు 50 ఎకరాల వరకు పంట నీట మునిగింది. నీట్లో పత్తిపంట మునిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోస్గి మండలం సాతనూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. పులికనుమ పంప్‌హౌస్ పైప్‌లైన్ పగిలి రెండు రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్ధానికులు, రైతులు మండిపడుతున్నారు. పగిలిపోయిన పైప్‌లైన్‌ను బాగు చేయించాలని కోరుతున్నారు. ఈ పైపులైన్ పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు పొలాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో తీవ్ర పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos