ఓటీటీలో శ్రీముఖి ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ మూవీ
'పటాస్' అనే షోతో పాపులారిటీ పొందిన యాంకర్ శ్రీముఖి. 'బిగ్‌బాస్ సీజన్-3'లో రన్నరప్‌గా నిలిచిన ఈ అమ్మడికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎప్పటి నుండో భావిస్తుండగా..

‘పటాస్’ అనే షోతో పాపులారిటీ పొందిన యాంకర్ శ్రీముఖి. ‘బిగ్‌బాస్ సీజన్-3’లో రన్నరప్‌గా నిలిచిన ఈ అమ్మడికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎప్పటి నుండో భావిస్తుండగా, ఇటీవల ఓ మంచి ప్రాజెక్ట్ తనకి దక్కింది. ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అనే సినిమా సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. అయితే ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుతం థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పట్లో మళ్లీ తెరుచుకునేలా కనిపించడం లేదు. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు శ్రీముఖి నటించిన ఈ సినిమా కూడా సెప్టెంబర్ 11న ఓటీటలో రిలీజ్ చేసేయనున్నారని తెలుస్తోంది. శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్‌కి ఓటీటీలో రిలీజ్ చేసినా కలిసొస్తుందనే భావిస్తున్నారు దర్మక నిర్మాతలు. ఇట్ టైమ్ టు పార్టీ సినిమాకి ఈవీఎస్ దర్మకత్వం వహించారు.
Read More:
బ్రేకింగ్ః గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
మధర్ థెరిస్సా మాటలను గుర్తు చేసిన చిరు
మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు
జగనన్న విద్యాకానుక: విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే