స్టూడెంట్స్ అలెర్ట్.. ఆన్‌లైన్ క్లాసుల టైమింగ్స్ ఇవే.!
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇక దానికి సంబంధించిన షెడ్యూల్, టైమింగ్స్ ఈ విధంగా ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన విద్యా సంవత్సరాన్ని(2020-21) సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ రోజు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇక దానికి సంబంధించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
- నర్సరీ, ప్రీ-స్కూల్ పిల్లలకు వారంలో 3 రోజుల పాటు, రోజూ 45 నిమిషాలు క్లాసులు జరగనున్నాయి.
- 1 నుంచి 5 తరగతులకు వారంలో 5 రోజులు, రోజుకు 3 సెషన్లు(ఒక్కో సెషన్ 30-45 నిమిషాలు, రోజూ 90 నిముషాలు) ఉంటాయి.
- 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రోజుకు 4 సెషన్లు, 30-45 నిమిషాలు (5 రోజులు, రోజూ 120 నిమిషాలు) జరుగుతాయి.
- ఇక 9, 10 తరగతులకు 6 సెషన్లు, 30-45 నిముషాలు( 5 రోజుల పాటు, రోజూ 180 నిముషాలు) క్లాసులు జరగనున్నాయి.
అటు సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇవాళ్టి నుంచి టీచర్లు, లెక్చరర్లు విధులకు హాజరు కానున్నారు. దూరదర్మన్, టీ-శాట్ ద్వారా డిజిటల్ క్లాసులు ప్రసారం కానున్నాయి.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..