Washington DC: వాషింగ్టన్‌ను వణికిస్తున్న మైక్‌కెన్నీ ఫైర్‌.. ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న జనాలు..

|

Aug 08, 2022 | 9:55 AM

washington DC: అమెరికా వాయువ్య రాష్ట్రం వాషింగ్టన్‌ను భారీ కార్చిచ్చు వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఒరెగాన్‌ రాష్ట్రాల మీదుగా వాషింగ్టన్‌ వరకూ..

Washington DC: వాషింగ్టన్‌ను వణికిస్తున్న మైక్‌కెన్నీ ఫైర్‌.. ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న జనాలు..
Wild Fire
Follow us on

washington DC: అమెరికా వాయువ్య రాష్ట్రం వాషింగ్టన్‌ను భారీ కార్చిచ్చు వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఒరెగాన్‌ రాష్ట్రాల మీదుగా వాషింగ్టన్‌ వరకూ నిద్రాణంగా విస్తరిస్తూ వచ్చిన ఈ కార్చిచ్చును మైక్‌కెన్నీ ఫైర్‌గా పిలుస్తున్నారు. ఈ మంటలు లిండ్‌ పట్టణాన్ని తాకాయి. అక్కడ ఉన్న ఓ కమ్యూనిటీలోని 14 నిర్మాణాలు కార్చిచ్చు బారిన పడి బూడిదగా మారాయి. ఇందులో ఆరు నివాస గృహాలు ఉన్నాయి. కార్చిచ్చును ముందే పసిగట్టిన ఆడమ్‌ కౌంటీ అధికారులు స్థానికులను హెచ్చరించి, ఇతర ప్రాంతాలకు తరలించారు.

స్పోకెన్‌ నగరానికి 121 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిండ్‌ పట్టణంలోని ఈ కమ్యూనిటీ కార్చిచ్చుకు ధాటికి తీవ్రంగా నష్టపోయింది. అక్కడి ఇళ్లు, వాహనాలు మంటల్లో కాలిపోయాయి. నష్టం అపారంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.. వీరంతా కట్టుబట్టలతో తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు. ఈ కమ్యూనిటీలో దాదాపు 500 మంది నివసిస్తున్నారు.. మంటలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇక్కడ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది.. దట్టంగా వ్యాపించిన మంటలు, పొగ కారణంగా తమ సిబ్బంది అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం స్పోకెన్‌ నగరానికి తరలించామని ఫైర్‌ అధికారులు తెలిపారు. యిరెకా ప్రాంతం నుంచి దాదాపు 13 వందల మందిని తరలించారు.

జూలై 29 నుంచి చెలరేగిన ఈ మంటలు క్రమంగా విస్తరిస్తూ వచ్చాయి, దాదాపు 10 చదదపు కిలో మీటర్ల పరిధిలో మంటలు వ్యాపించాయి. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్నాయి.. ఎండిపోయిన వృక్షాలు, మొక్కల కారణంగా మంటలు వేగంగా విస్తరించాయని అధికారులు చెబుతున్నారు. రహదారికి ఇరువైపులా ప్రమాదకర స్థాయిలో చెలరేగుతున్న మంటల్లో ఫైర్‌ వాహనాలు ప్రయాణించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..