AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒకే విమానంలో తల్లీకూతుళ్లు.. పైలట్లుగా సేవలు.. వైరలవుతోన్న ఎమోషనల్‌ వీడియో

తల్లీకూతుళ్లు చరిత్ర సృష్టించారు. పైలట్‌, కోపైలట్లుగా ఒకే విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన అమెరికా (America) లో జరిగింది.

Viral Video: ఒకే విమానంలో తల్లీకూతుళ్లు.. పైలట్లుగా సేవలు.. వైరలవుతోన్న ఎమోషనల్‌ వీడియో
Mother And Daughter
Basha Shek
|

Updated on: Aug 08, 2022 | 9:58 AM

Share

తల్లీకూతుళ్లు చరిత్ర సృష్టించారు. పైలట్‌, కోపైలట్లుగా ఒకే విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన అమెరికా (America) లో జరిగింది. హోలీ పెటిట్‌కు విమానంలో పైలట్‌గా రాణించాలన్నది కోరిక. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో 18 ఏళ్లుగా పని చేస్తున్నారామె. మరోవైపు హోలి కుమార్తె కీలి పెటిట్‌ కూడా చిన్నప్పటి నుంచి పైలట్‌ కావాలనుకుంది. 2017లో ఆమె పైలట్‌ లైసెన్స్‌ పొందింది. అనంతరం తల్లి పని చేస్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీగా చేరింది. 2018 నుంచి పూర్తి స్థాయి పైలట్‌గా ఆ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. కాగా, తల్లీకూతుళ్లు జూలై 23న చరిత్ర సృష్టించారు. పైలట్లైన ఇద్దరూ కలిసి డెన్వర్ నుంచి సెయింట్ లూయిస్‌కు ప్రయాణికుల విమానాన్ని నడిపారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి హోలి కెప్టెన్‌గా ఉండగా ఆమె కుమార్తె కీలి కో పైలట్‌గా ఉండటం విశేషం.

‘ఇక్కడ ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మా ఇద్దరికీ, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చాలా ప్రత్యేకమైన రోజు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ డెక్‌లో తొలి తల్లీకూతుళ్లం’ అని తమ సంతోషాన్ని తోటి ప్రయాణికులతో పంచుకున్నారు. కాగా తల్లీకూతుళ్ల విమానయానానికి సంబంధించిన వీడియోను సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది . దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తల్లీ, కుమార్తె అయిన హోలి, కీలి పైలట్లుగా రాణించడంతోపాటు, ఇద్దరూ కలిసి ఒకే విమానాన్ని నడిపి రికార్డు సృష్టించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం