బాప్ రే ! 20 లక్షల మందికి అమెరికా పౌరసత్వం.!. బిల్లు ఆమోదం

అమెరికా చరిత్రలో ఇదో కొత్త పరిణామం. సరైన డాక్యుమెంట్లు లేని శరణార్ధులకు, చిన్న పిల్లలుగా ఉండగానే తమ దేశానికి చేరుకున్నవారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. యుఎస్ సిటిజెన్ షిప్ కోసం ‘ కలలు కంటున్నవారికి ‘ కూడా ఇదో పెద్ద వరం . మంగళవారం డెమొక్రాట్లు ఈ బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టగా .. 237 మంది సభ్యులు అనుకూలంగా, 187 మంది ప్రతికూలంగా ఓటు వేశారు. అమెరికన్ డ్రీమ్ అండ్ […]

బాప్ రే ! 20 లక్షల మందికి అమెరికా పౌరసత్వం.!. బిల్లు ఆమోదం
Anil kumar poka

|

Jun 05, 2019 | 11:24 AM

అమెరికా చరిత్రలో ఇదో కొత్త పరిణామం. సరైన డాక్యుమెంట్లు లేని శరణార్ధులకు, చిన్న పిల్లలుగా ఉండగానే తమ దేశానికి చేరుకున్నవారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. యుఎస్ సిటిజెన్ షిప్ కోసం ‘ కలలు కంటున్నవారికి ‘ కూడా ఇదో పెద్ద వరం . మంగళవారం డెమొక్రాట్లు ఈ బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టగా .. 237 మంది సభ్యులు అనుకూలంగా, 187 మంది ప్రతికూలంగా ఓటు వేశారు. అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్ యాక్ట్-2019 అని వ్యవహరిస్తున్న ఈ బిల్లు.. ట్రంప్ ప్రభుత్వం విధించే కొన్ని నిబంధనలను వీరు పాటించే పక్షంలో.. వీరిని 10 ఏళ్ళ పాటు చట్టబద్ధంగా అమెరికాలో ఉండేందుకు వీలు కల్పిస్తారు.

కనీసం రెండు సంవత్సరాల పాటు దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినా, లేదా మూడేళ్ళ పాటు మిలిటరీ సర్వీసులో కొనసాగినా వీరికి శాశ్వత గ్రీన్ కార్డులు మంజూరు చేస్తారు. యుఎస్ లో పర్మనెంట్ గా నివాసం ఏర్పరచుకోవాలని కలలు కంటూ చట్టబధ్ధ చిక్కులను ఎదుర్కొంటున్న లక్షలాదిమందికి ఈ బిల్లు ఊరటనిస్తుందని అంటున్నారు. డెమొక్రాట్లు ప్రతిపాదించిన ఈ బిల్లును అడ్డుకునేందుకు ట్రంప్, రిపబ్లికన్లు కొంత ప్రయత్నించారు. ఇందులో మరిన్ని నిబంధనలు చేర్చాలని వారు వాదించారు. ట్రంప్ ఎప్పటిలాగే మెక్సికో బార్డర్ సమస్యను ప్రస్తావించారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గుమికూడుతున్న వేలాది శరణార్ధులవల్ల ప్రభుత్వం చిక్కులను ఎదుర్కొంటోందని, మొదట ఈ సమస్యను పరిష్కరించి ఆ తరువాత ఇలాంటి ‘ కంటితుడుపు ‘ చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. అయితే డెమొక్రాట్లు గట్టిగా పట్టుబట్టడంతో చివరకు ఈ బిల్లు సభలో నెగ్గింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu