మిస్‌ యూ..డోంట్‌ వర్రీ ప్రెసిడెంట్‌..కమల హ్యారీస్‌, ట్రంప్‌ ట్వీట్స్‌ వార్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమల హ్యారిస్‌ మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. కమల అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై స్పందించిన డొనాల్డ్‌‌..వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. మేము మిమ్మల్ని మిస్సవుతున్నామంటూ వెటకారంగా కామెంట్‌ చేశారు. వెంటనే ట్రంప్‌ ట్వీట్‌పై కౌంటర్ అటాక్‌ చేశారు కమల. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్షా. అభిశంసన విచారణలో కలుద్దామంటూ అంతే గట్టిగా చురకలంటించారు. డెమొక్రటిక్‌ అధ్యక్ష […]

మిస్‌ యూ..డోంట్‌ వర్రీ ప్రెసిడెంట్‌..కమల హ్యారీస్‌, ట్రంప్‌ ట్వీట్స్‌ వార్‌
Follow us
Anil kumar poka

| Edited By: Srinu

Updated on: Dec 04, 2019 | 5:26 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమల హ్యారిస్‌ మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. కమల అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై స్పందించిన డొనాల్డ్‌‌..వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. మేము మిమ్మల్ని మిస్సవుతున్నామంటూ వెటకారంగా కామెంట్‌ చేశారు. వెంటనే ట్రంప్‌ ట్వీట్‌పై కౌంటర్ అటాక్‌ చేశారు కమల. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్షా. అభిశంసన విచారణలో కలుద్దామంటూ అంతే గట్టిగా చురకలంటించారు.

డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో నిలిచి..ఒకానొక దశలో ట్రంప్‌తో తలపడేది తనేనన్న భావన కలిగించారు కమల హ్యారీస్‌. జనవరిలో బాల్టిమోర్‌ నుంచి ఫర్‌ ద పీపుల్‌ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆమె..అధ్యక్షునిపై గట్టి విమర్శనాస్త్రాలు సంధించారు. ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలను వేలెత్తి చూపించారు. అయితే న్యూయార్క్‌ మేయర్‌ మైక్‌ బ్లూమ్‌ బర్గ్‌ రంగంలోకి దిగడం..హెల్త్‌కేర్‌ వంటి పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తామన్న విషయాలపై స్పష్టతనివ్వకపోవడంతో తనకు మద్దతు కూడగట్టడంలో కమల వెనుకబడ్డారు. ఈ క్రమంలోపార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఆమె 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ఆమె వైదొలిగారు.

అమెరికాలో సెనేటర్‌గా ఎంపికైన తొలి నల్ల జాతీయురాలిగా కమల హ్యారీస్ చరిత్ర సృష్టించారు‌. కానీ అనూహ్యంగా అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతున్నట్లు స్వయంగా ఆమెనే వెల్లడించారు. ఇందుకు ఆర్థికపరమైన సమస్యలే కారణమని ప్రకటించాచారామె. తాను బిలియనీర్‌ను కాదని..సొంత ప్రచారానికి నిధులు సమకూర్చే పరిస్థితుల్లో లేనని తెలిపారు. ఆర్థిక వనరుల కోసం అన్ని మార్గాలను అన్వేషించానన్న ఆమె..కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో..తన జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవలసివచ్చిందని తెలిపారు. ఐతే ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు కమల నిర్ణయంపై ఆమె మద్దతుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి వైదొలగడం జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక ఇప్పటికే మెంటానా గవర్నర్‌ స్టివ్‌ బుల్లోక్‌, మాజీ కాంగ్రెస్‌ సభ్యులు జో సెస్టాక్‌ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు.

కమల హ్యారీస్‌ తల్లి చెన్నైకి చెందిన వారు కాగా..తండ్రి ఆఫ్రికన్‌. ఆఫ్రికా, ఆసియాల మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను లేడీ బరాక్‌ ఒబామాగా పిలిచేవారు. 1964 అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలో జన్మించిన కమల..1986లో హోవార్డ్‌ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్టిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత హేస్టింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి లా పట్టా తీసుకున్నారు. ఇక 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్‌ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011-17లో డగ్లస్‌ ఎమ్‌హోఫ్‌ను పెళ్లి చేసుకున్న కమల..2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంభిస్తున్నవిధానాలపై తీవ్రస్థాయిలో గళమెత్తిన ఆమె..చివరికిలా ఆర్థిక కారణాలతో అధ్యక్ష బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.