కరోనా వైరస్ ఎఫెక్ట్, నిరాడంబరంగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం, బ్యారికేడ్లతో సెక్యూరిటీ అత్యంత కట్టుదిట్టం.

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం నిరాడంబరంగా జరిగే అవకాశాలున్నాయి. ఎప్పుడూ లక్షలాది ప్రజలు, అభిమానులతో ఆర్భాటంగా..

  • Umakanth Rao
  • Publish Date - 11:16 am, Mon, 18 January 21
కరోనా వైరస్ ఎఫెక్ట్, నిరాడంబరంగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం, బ్యారికేడ్లతో సెక్యూరిటీ అత్యంత కట్టుదిట్టం.

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం నిరాడంబరంగా జరిగే అవకాశాలున్నాయి. ఎప్పుడూ లక్షలాది ప్రజలు, అభిమానులతో ఆర్భాటంగా, కోలాహలంగా సాగే ఈ విధమైన ఈవెంట్లకు ఇది పూర్తి విరుధ్దమని అంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతివారూ మాస్కులు ధరించాల్సిందే..లోగడ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సుమారు 10 లక్షల మందికి పైగా హాజరయ్యే వాషింగ్టన్ నగరం క్రిక్కిరిసిపోయేది. కానీ బైడెన్ ప్రమాణ స్వీకారం రోజున అలాంటి సన్నివేశాలు కనిపించవు.ముందుగానే అనేక చోట్ల ప్రధాన రోడ్లను మూసివేస్తున్నారు. రెండు రోజులపాటు బ్రిడ్జీలు కూడా క్లోజ్ ! అన్ని చోట్లా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షలమంది నేషనల్ గార్డులు అత్యంత అప్రమత్తంగా సెక్యూరిటీని పర్యవేక్షిస్తారు. క్యాపిటల్ బిల్డింగ్ పై ప్రభుత్వ అధికారులు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. ఇక ప్రధాన వేదికమీద మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యు బుష్, బరాక్ ఒబామా ఆసీనులవుతారు. పదవి నుంచి దిగిపోనున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ని కూడా ఆహ్వానం అందింది.

లేడీ గాగా అమెరికా జాతీయ గీతం ఆలపిస్తే..22 ఏళ్ళ ఆఫ్రికన్ అమెరికన్ పోయెట్ అమందా గోర్మన్ కవితను చదివి వినిపిస్తారు. పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ పాప్ గీతం ఆలపిస్తుంది. ఇక త్వరలో మాజీ అధ్యక్షుడు కానున్న ట్రంప్ ఎలాగూ బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోరని ఇదివరకే వార్తలు వచ్చ్చాయి.

Also Read:

ఎనర్జిటిక్ స్టార్‌తో ఎఫ్ 2 దర్శకుడు.. ఇక ప్రేక్షకులకు మరింత ఫన్.. సినిమా ఎప్పుడో తెలుసా..

Mahesh Babu: మహేశ్‌బాబు నెక్స్ట్ సినిమాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరితో చేస్తారో..

బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్, అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు రెగ్యులేటర్ ఆమోదం, టీకామందు తీసుకున్న నర్సు