మిషిగాన్ గవర్నర్ కిడ్నాప్ కు కుట్ర భగ్నం, ట్రంప్ పై ఆరోపణ

అమెరికాలో మిషిగాన్ గవర్నర్ గ్రెచెన్ వైట్మర్ కిడ్నాప్ కి కుట్ర జరిగింది. ఈ కేసులో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు ప్రభుత్వ వ్యతిరేక మిలిషియా గ్రూపునకు చెందినవారు. డెమొక్రాట్ ఆంయిన గ్రెచెన్..

  • Umakanth Rao
  • Publish Date - 11:32 am, Fri, 9 October 20
మిషిగాన్ గవర్నర్ కిడ్నాప్ కు కుట్ర భగ్నం, ట్రంప్ పై ఆరోపణ

అమెరికాలో మిషిగాన్ గవర్నర్ గ్రెచెన్ వైట్మర్ కిడ్నాప్ కి కుట్ర జరిగింది. ఈ కేసులో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు ప్రభుత్వ వ్యతిరేక మిలిషియా గ్రూపునకు చెందినవారు. డెమొక్రాట్ ఆంయిన గ్రెచెన్.. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై బాహాటంగానే అధ్యక్షుడు ట్రంప్ ను దుయ్యబడుతున్నారు. కోవిద్ ఇంతగా ప్రబలిపోవడానికి ఆయన కారకుడని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ట్రంప్,, ఈ గవర్నర్ ను తన ప్రభుత్వ వ్యతిరేకిగా తప్పు పట్టారు. ఆమె డెమొక్రాట్ లక్షణాలు అందరికీ తెలిసిందేనన్నారు. కాగా మిషిగాన్ లోని కుట్రదారులు లాన్సింగ్ లోని గవర్నర్ భవనాన్ని ముట్టడించి, అందులోని వారిని బందీలుగా చేసుకునేందుకు సుమారు రెండువందలమందిని సాయంగా తీసుకోవాలని కూడా పథకం పన్నారని పోలీసులు తెలిపారు. అలాగే  గవర్నర్ ను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేయాలని కూడా ప్లాన్  వేశారు.