చారిటీకి విరాళం కోసం సాయి నృత్య అకాడమీ ముందడుగు
అమెరికా : డాలస్‌లోని సాయి నృత్య అకాడమీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏలిన్ పబ్లిక్ లైబ్రరీలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పిల్లలు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. రకరకాల డాన్స్ స్టైల్స్‌తో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. పేద పిల్లల కోసం పనిచేసే విభా అనే లాభాపేక్ష రహిత సంస్థకు విరాళాలు సేకరించినట్లు సాయి నృత్య అకాడమీ నిర్వాహకురాలు యడ్లపాటి […]
అమెరికా : డాలస్‌లోని సాయి నృత్య అకాడమీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏలిన్ పబ్లిక్ లైబ్రరీలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. పిల్లలు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. రకరకాల డాన్స్ స్టైల్స్‌తో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. పేద పిల్లల కోసం పనిచేసే విభా అనే లాభాపేక్ష రహిత సంస్థకు విరాళాలు సేకరించినట్లు సాయి నృత్య అకాడమీ నిర్వాహకురాలు యడ్లపాటి శ్రీదేవి అన్నారు.